IAF | పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor)ను విజయవంతంగా చేపట్టిన విషయం తెలిసిందే. పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలను త్రివిధ దళాలు సమన్వయంతో ధ్వంసం చేశాయి. కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించి ఉగ్రమూకల పనిపట్టాయి. ఇక ఆపరేషన్‌కు సంబంధించిన దృశ్యాలను మన బలగాలు గత కొన్ని రోజులుగా ఎక్స్ వేదికగా షేర్ చేస్తున్నాయి. తమ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తూ శత్రు దేశాలకు స్ట్రాంగ్ మెసేజ్ (Delivers Powerful Message)ఇస్తున్నాయి.
తాజాగా భారత వాయుసేన (Indian Air Force) కూడా ఆ తరహా వీడియోను పంచుకుంది. ‘ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఎల్లప్పుడూ దృఢ సంకల్పంతో ప్రతిస్పందిస్తుంది’ అంటూ తన సంసిద్ధత, సామర్థ్యాన్ని ప్రదర్శించింది. వైమానిక దళ విన్యాసాలు, కమాండర్ల వేగవంతమైన ప్రతిస్పందన, శత్రు స్థావరాలపై మిస్సైల్ దాడులను అందులో ప్రదర్శించింది. ఐఏఎఫ్ ఎక్స్‌లో పోస్టు చేసిన ఈ వీడియో గూస్బంప్స్ తెప్పిస్తోంది.
#IndianAirForce@PMOIndia@rajnathsingh@DefenceMinIndia@SpokespersonMoD @HQ_IDS_India @adgpi @indiannavy@IndiannavyMedia @PIB_India @MIB_India pic.twitter.com/xXnycOOXva
— Indian Air Force (@IAF_MCC) May 20, 2025
Also Read..
Jyoti Malhotra | జ్యోతి మల్హోత్రాపై ప్రశ్నల వర్షం.. వెలుగులోకి కీలక విషయాలు
Pakistani shell | పూంచ్‌లో పాక్ లైవ్ షెల్.. ధ్వంసం చేసిన భారత ఆర్మీ