Pakistani shell | సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ జమ్ము కశ్మీర్లో పాక్ ప్రయోగించిన ఓ లైవ్ షెల్ (live Pakistani shell) బయటపడింది. రోడ్డు పక్కన ఈ షెల్‌ను గుర్తించిన స్థానికులు.. అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న భారత ఆర్మీ (Indian Army) పాక్ షెల్‌ను విజయవంతంగా ధ్వంసం చేసింది.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ను విజయవంతంగా చేపట్టిన విషయం తెలిసిందే. పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. భారత్ దాడులను జీర్ణించుకోలేని పాక్ తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. భారత సరిహద్దు గ్రామాలపై దాడులకు పాల్పడింది. ముఖ్యంగా జమ్ము కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్లు, బాంబ్ షెల్స్‌ను ప్రయోగించింది. అప్రమత్తమైన సైన్యం సరిహద్దు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది.
అయితే, ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రావడంతో ప్రజలు తమ గ్రామాలకు చేరుకున్నారు. ఈ క్రమంలో పూంచ్ (Poonch) వద్ద రోడ్డు పక్కన పాక్ ప్రయోగించిన లైవ్ షెల్‌ను గుర్తించిన స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన భద్రతా దళాలు దాన్ని పేల్చేశాయి. పాక్ చర్యలకు పూంచ్ ప్రాంత ప్రజలు ఎక్కువగా ప్రభావితమయ్యారు. అక్కడ 25 మంది ప్రాణాలు కోల్పోయారు.
Also Read..
Beating Retreat: 10 రోజుల సీజ్ఫైర్ తర్వాత.. నేటి నుంచి బీటింగ్ రిట్రీట్ సెర్మనీ