డ్రాగన్ దూకుడుకు చెక్

న్యూఢిల్లీ : నియంత్రణ రేఖ వెంబడి చైనా దళాలు దూకుడు ప్రదర్శిస్తే భారత్ సైతం దుందుడుకుగా వ్యవహరిస్తుందని భారత వైమానిక దళం చీఫ్ ఎయిర్‌మార్షల్ ఆర్కేఎస్ బధౌరియా స్పష్టం చేశారు. ఎల్ఏసీ వద్ద డ్రాగన్ దూకుడును ప్రస్తావించగా భారత్ కూడా దీటుగా ప్రతిస్పందిస్తుందని బదులిచ్చారు. భారత్-చైనాల మధ్య పెనువివాదం అంతర్జాతీయంగా చైనాకు మంచిదికాదని హితవు పలికారు. చైనా అంతర్జాతీయ ప్రణాళికలకు భారత్‌తో వ్యవహరిస్తున్న దుందుడుకు వైఖరికి పొంతన లేదని దుయ్యబట్టారు.
ఎల్ఏసీ వెంబడి చైనా భారీగా దళాలను మోహరించడంతో పాటు పెద్దసంఖ్యలో రాడార్లు, ఉపరితలం నుంచి గగనతల క్షిపణులు, ఉపరితలం నుంచి ఉపరితల క్షిపణులను మోహరించిందని చెప్పారు. చైనా సన్నద్ధతకు దీటుగా భారత్ సైతం అన్ని చర్యలూ చేపట్టిందని స్పష్టం చేశారు. తూర్పు లడఖ్‌లో ఉద్రిక్తతల కారణంగా గత ఆరునెలలుగా భారత్-చైనాల మధ్య సరిహద్దుల్లో ప్రతిష్టంభన నెలకొంది. ప్రతిష్టంభనను తొలగించేందుకు ఇరు దేశాల సైనిక, దౌత్యాధికారుల మధ్య పలుమార్లు చర్చలు జరిగినా అంగీకారం కుదరలేదు.
తాజావార్తలు
- వ్యాక్సినే సురక్షితమైన ఆయుధం
- రాష్ట్రంలో పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు
- మార్చి 5నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
- మళ్లీ మాస్కు కట్టండి
- పాలమూరు వాణి
- 26-02-2021 శుక్రవారం.. మీ రాశి ఫలాలు
- వాణియే మేటి..
- అలవాటైన నడకతో అవార్డుల పంట
- పెట్రోల్ బంకుల్లో కల్తీని సహించం
- పార్కింగ్ ఫీజు వసూలు చేస్తే .. భారీ మూల్యం తప్పదు!