బుధవారం 08 జూలై 2020
National - Jun 17, 2020 , 17:22:24

నా ఇద్దరు మనువళ్లను బార్డర్‌కు పంపుతా : జవాన్‌ కుందన్‌ కుమార్‌ తండ్రి

నా ఇద్దరు మనువళ్లను బార్డర్‌కు పంపుతా : జవాన్‌ కుందన్‌ కుమార్‌ తండ్రి

బీహార్‌ : భారత్‌, చైనా మధ్య గాల్వన్‌లో జరిగిన ఘర్షణలో మృతి చెందిన భారతదేశ జవాన్ల తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. వారు తమ బిడ్డలను దేశం కోసం పెంచామని, గర్వంగా దేశం కోసం ప్రాణాలొదిలారని, తమకేం బాధ లేదని చెబుతున్నా.. కన్నీటిని ఆపుకోలేకపోతున్నారు. ‘నా కుమారుడు దేశం కోసం ప్రాణాలు వదిలాడు.. నాకు ఇద్దరు మనువళ్లు ఉన్నారు..  వాళ్లను కూడా సైనికులుగా తయారు చేస్తా.. బార్డర్‌కు పంపుతా’ అని భారత్‌, చైనా మధ్య జరిగిన ఘర్షణలో అమరుడైన బిహార్‌కు చెందిన జవాన్‌ కుందన్‌కుమార్‌ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.logo