Meghalaya murder : మేఘాలయ (Meghalaya) లో మధ్యప్రదేశ్ (Madhyapradesh) కు చెందిన రాజా రఘువంశీ (Raja Raghuvanshi) హత్య దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. కట్టుకున్న భార్యే కిరాయి హంతకులను పెట్టి ఆయనను హత్య చేయించింది. హనీమూన్ పేరుతో భర్తను చిరపుంజికి తీసుకెళ్లి దగ్గరుండి మరీ హత్యకు ఆదేశించింది. పెళ్లయిన 10 రోజులకే ప్రియుడి కోసం ఈ దారుణానికి ఒడిగట్టింది.
ఘటనపై తాజాగా మృతుడు రాజా రఘువంశీ అన్న భార్య కిరణ్ రఘువంశీ స్పందించారు. సోనమ్ దగ్గర రెండు ఫోన్లు ఉండేవని, ఎందుకని అడిగితే ఒకటి ఆఫీస్ కోసం, మరొకటి తన పర్సనల్ యూసేజ్ కోసమని చెప్పిందని ఆమె తెలిపారు. ఆమె తరచూ ఫోన్లో మాట్లాడటం తాను చూడలేదుగానీ, తరచూ ఫోన్లో చాటింగ్ మాత్రం చేస్తుండేదని అన్నారు.
ఆమె ఎప్పుడూ ఫోన్ను విడిచి ఉండేది కాదని కిరణ్ రఘువంశీ చెప్పారు. మా ఇంట్లో అడుగుపెట్టిన పది రోజుల్లోపలే మాకెంతో ఇష్టమైన వ్యక్తిని పొట్టనపెట్టుకుందని, ఆమెను సాధ్యమైనంత తొందరగా ఉరితీయాలని డిమాండ్ చేశారు. ఆమె సోదరుడు ఫోన్ చేసి క్షమాపణలు కోరాడని, మాకు ఎవరి క్షమాపణలు అక్కర్లేదని, ఆమెను ఉరితీస్తేనే మా మరిదికి ఆత్మశాంతి కలుగుతుందని అన్నారు.
#WATCH | Indore, MP: Kiran Raghuvanshi, sister-in-law of Raja Raghuvanshi says, “Sonam had two phones, she used to tell us that one of those was for her office purposes and the other for her personal usage…I didn’t see her regularly speaking over phone but she used to keep… pic.twitter.com/mPQiMqZfN2
— ANI (@ANI) June 11, 2025