Jammu Srinagar Highway | రుతుపవనాల ప్రభావంతో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. జమ్మూ కశ్మీర్ లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. వర్షం కారణంగా పలు చోట్ల రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. రాంబన్ (Ramban) జిల్లాలోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. మరోవైపు జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై (Jammu – Srinagar Highway) రెండు సొరంగాలను కలిపే రహదారి వర్షం ధాటికి కొట్టుకుపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నప్పటికీ రోడ్డును క్లియర్ చేసేందుకు దెబ్బతిన్న విభాగాలకు మరమ్మతులు చేయడం వంటి పనులు కొనసాగిస్తున్నట్లు ట్రాఫిక్ విభాగం అధికారులు తెలిపారు. పునరుద్ధరణ పనులు పూర్తయ్యే వరకూ ప్రజలు హైవేపై ప్రయాణించొద్దని సూచించారు. మరోవైపు ఆదివారం వరకూ జమ్మూ కశ్మీర్ అంతటా ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
Also Read..
Joe Biden | రసాయన ఆయుధాలను ధ్వంసం చేసిన అమెరికా.. ప్రకటించిన అధ్యక్షుడు బైడెన్
Vignesh Shivan | నయన్ దంపతులపై కేసు నమోదు.. ఆస్తి కాజేశారంటూ ఫిర్యాదు..?
Adipurush writer | ఆదిపురుష్ వివాదం.. క్షమాపణలు చెప్పిన డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషిర్