శ్రీనగర్: ఉగ్రవాద నిర్మూలణలో భద్రతా దళాలు మరోమారు పైచేయి సాధించాయి. హిజ్బుల్ ముజాహిదీన్ టాప్ కమాండర్ మెహ్రాజుద్దీన్ హల్వాయిని మట్టుబెట్టాయి. బుధవారం తెల్లవారుజామున జమ్ముకశ్మీర్‌లోని హంద్వారాలో జరిగిన ఎన్కౌంటర్లో మెహ్రాజుద్దీన్ హల్వాయి అలియాస్ ఉబైద్ హతమయ్యాడు. ఉబైద్ అనేక ఉగ్రవాద నేరాలకు పాల్పడినట్లు కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ వెల్లడించారు. ఇది తమకు చాలా పెద్ద విజయమని ట్వీట్ చేశారు.
One of the oldest & top commander of HM #terror outfit Mehrazuddin Halwai @ Ubaid got neutralised in #Handwara #encounter. He was involved in several terror crimes. A big success: IGP Kashmir.@JmuKmrPolice
— Kashmir Zone Police (@KashmirPolice) July 7, 2021