Himachal Pradesh | హిల్‌స్టేట్ హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలకు ఆకస్మిక వరదలు సంభవించాయి. రాష్ట్రంలోని పలు ప్రధాన నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. అనేక చోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. ముఖ్యంగా మండి (Mandi) జిల్లా ఈ వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్నది. కాంగ్రా, మండి, హమీర్పూర్, సిమ్లా, సిర్మౌర్, సోలన్ జిల్లాల్లో శుక్రవారం వరకూ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అంతేకాదు ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉందని తెలిపింది.
మంగళవారం నుంచి కురుస్తున్న కుండపోత వర్షం కారణంగా ఆకస్మిక వదరలు సంభించాయి. దీంతో 14 వంతెనలు, 148 ఇళ్లు, దుకాణాలు కొట్టుకుపోయాయి. ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 51 మంది ప్రాణాలు కోల్పోయారు. 34 మంది గల్లంతయ్యారు. వారిని రక్షించేందుకు గురువారం మూడో రోజు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కొండచరియలు విరిగిపడిన కారణంగా దాదాపు 460 రోడ్లను అధికారులు మూసివేశారు. మండి జిల్లాకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా పలు జిల్లాల్లోని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. అంతేకాదు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడుతున్న కారణంగా ఆ ప్రాంతాలవైపు వెళ్లొద్దని సూచిస్తున్నారు. ప్రయాణాలను కూడా వాయిదా వేసుకోవాలని సూచించారు.
Also Read..
Air India | ఎయిర్ ఇండియాకు చెందిన మరో డ్రీమ్‌లైనర్ విమానంలో సమస్య.. వియన్నాలో నిలిపివేత
Mohammed Shami | రూ.4లక్షలు చాలా తక్కువ.. కోర్టు తీర్పుపై షమీ మాజీ భార్య