Mohammed Shami | రూ.4లక్షలు చాలా తక్కువ.. కోర్టు తీర్పుపై షమీ మాజీ భార్య
Mohammed Shami | టీమ్ ఇండియా క్రికెటర్ మొహమ్మద్ షమీ (Mohammed Shami)కి.. కోల్కతా హైకోర్టు (Calcutta High Court) కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. భార్య హసిన్ జహాన్ (Hasin Jahan)తో పాటు కూతురికి ప్రతి నెలా రూ.4 లక్షలు (alimony) ఇవ్వాలని ఆదేశించింది.
Mohammed Shami | టీమ్ ఇండియా క్రికెటర్ మొహమ్మద్ షమీ (Mohammed Shami)కి.. కోల్కతా హైకోర్టు (Calcutta High Court) కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. భార్య హసిన్ జహాన్ (Hasin Jahan)తో పాటు కూతురికి ప్రతి నెలా రూ.4 లక్షలు (alimony) ఇవ్వాలని ఆదేశించింది. మెయింటేనెన్స్లో భాగంగా ఆ అమౌంట్ ఇవ్వాలని కోర్టు తన తీర్పులో పేర్కొన్నది. ఇందులో భార్యకు రూ.1.5 లక్షలు, కూతురికి రూ.2.5 లక్షలు ఇవ్వాలని కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. కోర్టు తీర్పుపై షమీ ఇప్పటి వరకూ స్పందించకపోగా.. హసిన్ జహాన్ మాత్రం రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు కోర్టు తీర్పుపట్ల సంతోషం వ్యక్తం చేశారు. సుదీర్ఘంగా చేసిన పోరాటానికి విజయం దక్కిందన్నారు. అదే సమయంలో రూ.4లక్షలు చాలా తక్కువ అని.. తాము రూ.10లక్షలు డిమాండ్ చేసినట్లు చెప్పారు.
కోర్టు తీర్పుతో ఇప్పుడు తన కుమార్తెకు మంచి విద్యను అందించగలనని పేర్కొన్నారు. అయితే, షమీ స్థాయి, అతడి జీవన విధానం, సంపాదనకు ఈ భరణం చాలా తక్కువ అని పేర్కొన్నారు. తాము అతడి నుంచి నెలకు రూ.10లక్షలు ఇప్పించాలని గతంలోనే కోర్టుకు విజ్ఞప్తి చేసినట్లు గుర్తు చేశారు. అప్పటి నుంచి ఆదాయం, ఖర్చులు పెరిగాయని, షమీ ఎలా జీవితాన్ని గడుపుతున్నారో.. తానూ, తన కూతురు కూడా అదే రీతిలో కొనసాగించే హక్కు ఉందని ఆమె పేర్కొన్నారు.
షమీ-హసీన్ 2014లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఒక కుమార్తె ఉంది. అయితే ఈ దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో 2018లో షమీపై హసీన్ గృహ హింస, దాడి, వరకట్న వేధింపులు వంటి ఆరోపణలు చేసింది. ఈ విషయమై హసీన్ కోర్టును ఆశ్రయించింది. దీంతో షమీపై దాడి, హత్యాయత్నం, గృహ హింస తదితర అభియోగాలపై కేసు నమోదైంది. ఈ క్రమంలోనే 2019 ఆగస్టులో కోల్కతాలోని అలిపోర్ కోర్టు.. క్రికెటర్పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అయితే దీన్ని షమీ సెషన్స్ కోర్టులో సవాల్ చేయగా.. అరెస్టు వారెంట్, క్రిమినల్ విచారణ ప్రక్రియపై స్టే విధిస్తూ 2019 సెప్టెంబర్లో సెషన్స్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదిలా ఉండగా.. షమీపై గృహహింస కేసు నమోదు చేసినప్పుడు.. తనకు భరణం కింద నెలకు రూ.10 లక్షలు ఇవ్వాలని ఆమె కోర్టులో కేసు వేసింది. అందులో రూ.7 లక్షలు తన ఖర్చుల నిమిత్తం కాగా, మరో రూ.3 లక్షలు కుమార్తె కోసమని పేర్కొంది. దీనిపై ఈ ఏడాది జనవరిలో విచారణ జరిపిన కోల్కతా హైకోర్టు.. హసీన్ (Hasin Jahan)కు భరణం కింద ప్రతి నెలా రూ.1.30లక్షలు చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో రూ.50వేలు హసీన్కు కాగా, మరో రూ.80వేలు కుమార్తె బాగోగుల కోసం చెల్లించాల్సిందిగా ఉత్తర్వుల్లో ఆదేశించింది.
Also Read..
social media accounts | పాక్ సెలబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలను మరోసారి బ్లాక్ చేసిన భారత్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

