కోల్‌కతా: భారత సీనియర్ క్రికెటర్ మహమ్మద్ షమీ మళ్లీ చిక్కుల్లో పడ్డాడు. ఇప్పటికే ఫిట్‌నెస్‌లేమితో జట్టుకు దూరమైన షమీని తాజాగా కుటుంబ సమస్యలు చుట్టుముట్టాయి. షమీ భార్య హసిన్ జహాన్ దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను విచారించిన కోల్‌కతా హైకోర్టు బుధవారం తీర్పు వెలువరించింది.
నెలవారి ఖర్చుల కోసం రూ.4 లక్షలు చెల్లించాల్సిందిగా కోర్టు ఆదేశించింది. భార్య జహాన్‌కు రూ.1.5 లక్షలు, కూతురుకు రూ.2.5 లక్షల చొప్పున నెలవారీగా చెల్లించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.