social media accounts | పాక్ సెలబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలను మరోసారి బ్లాక్ చేసిన భారత్
social media accounts | దాయాది పాకిస్థాన్‌కు చెందిన సెలబ్రిటీల (Pakistani celebrities) సోషల్ మీడియా ఖాతాలను (social media accounts) భారత్ మరోసారి బ్లాక్ చేసింది.
social media accounts | దాయాది పాకిస్థాన్‌కు చెందిన సెలబ్రిటీల (Pakistani celebrities) సోషల్ మీడియా ఖాతాలను (social media accounts) భారత్ మరోసారి బ్లాక్ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్‌కు చెందిన పలు మీడియా సంస్థల అకౌంట్లు, సెలబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలను భారత్ విత్‌హెల్డ్‌లో ఉంచిన విషయం తెలిసిందే.
అయితే, బుధవారం ఆ నిషేధాన్ని ఎత్తివేసింది. దీంతో సోషల్ మీడియాలో పాక్‌కు చెందిన సెలబ్రిటీల ఖాతాలు, పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. దీనిపై దేశ వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. నెటిజన్లు ఆయా ఖాతాలను బ్లాక్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, దీనిపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయలేదు. గురువారం ఉదయం నుంచి పాకిస్థాన్‌కు చెందిన పలువురు ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాలు భారత్‌లో కనిపించలేదు. హనియా అమీర్, మహీరా ఖాన్, షాహిద్ అఫ్రిది, మావ్రా హొకేన్, ఫవాద్ ఖాన్ వంటి పాకిస్థానీ ప్రముఖుల ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ప్రొఫైల్స్ గురువారం ఉదయం నుంచి అందుబాటులో లేకుండా పోయాయి.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌పై భారత్ పలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఆ దేశానికి చెందిన పలువురు ట్విట్టర్ అకౌంట్లు, పలు యూట్యూబ్ ఛానళ్లపై బ్యాన్ విధించింది. పాక్ ప్రభుత్వానికి చెందిన పలు సోషల్ మీడియా ఖాతాలను కూడా విత్‌హెల్డ్ చేసింది. అంతేకాదు, తప్పుడు, రెచ్చగొట్టే, సున్నితమైన మతపరమైన అంశాల కంటెంట్‌ను ప్రసారం చేస్తున్నాయని పాకిస్థాన్ యూట్యూబ్ చానళ్లపై కూడా నిషేధం విధించింది. ఇందులో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్‌కు చెందిన యూట్యూబ్ చానల్ కూడా ఉన్నది. హోం శాఖ సిఫారసు మేరకు డాన్ న్యూస్, జియో న్యూస్, సమా టీవీ, సునో న్యూస్, ది పాకిస్థాన్ రెఫరెన్స్ తదితర యూట్యూబ్ చానళ్లపై కేంద్రం నిషేధం విధించింది.
Also Read..
Kidnap | మాలిలో సిమెంట్ ఫ్యాక్టరీపై అల్‌ఖైదా ఉగ్రదాడి.. ముగ్గురు భారతీయ కార్మికులు కిడ్నాప్
PM Modi | మోదీకి ఘనా అత్యున్నత పురస్కారం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

