Kidnap | మాలిలో సిమెంట్ ఫ్యాక్టరీపై అల్‌ఖైదా ఉగ్రదాడి.. ముగ్గురు భారతీయ కార్మికులు కిడ్నాప్
పశ్చిమాఫ్రికా దేశమైన మాలి (Mali)లో ముగ్గురు భారతీయులు కిడ్నాప్ (Kidnap)కు గురయ్యారు. కాయెస్ ప్రాంతంలోని డైమెండ్ సిమెంటు ఫ్యాక్టరీపై సాయుధ దుండగులు దాడి చేసిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది.
న్యూఢిల్లీ: పశ్చిమాఫ్రికా దేశమైన మాలి (Mali)లో ముగ్గురు భారతీయులు కిడ్నాప్ (Kidnap)కు గురయ్యారు. కాయెస్ ప్రాంతంలోని డైమెండ్ సిమెంటు ఫ్యాక్టరీపై సాయుధ దుండగులు దాడి చేసిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. నిషేధిత ఉగ్రవాద సంస్థ అయిన అల్‌ఖైదాతో అనుబంధం ఉన్న టెర్రరిస్టులు ఈ దాడికి పాల్పడినట్లు భారత విదేశాంగశాఖ గురువారం వెల్లడించింది. ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

ఈనెల 1న సిమెంటు ఫ్యాక్టరీపై దాడిచేసిన సాయుధ దుండగులు.. అక్కడ పనిచేస్తున్న కార్మికులను బంధించారని, వారిలో ముగ్గురు భారతీయులు ఉన్నారని తెలిపింది. అయితే వారి వివారలను మాత్రం వెల్లడించలేదు. మాలి రాజధాని బమాకోలోని భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులు, పరిశ్రమ యాజమాన్యంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొంది. బందీలను సురక్షితంగా విడుదల చేయడాలనికి చర్యలు తీసుకోవాలని కోరింది. కాగా, ఈ దాడికి పాల్పడింది తామేనంటూ అల్‌ఖైదా అనుబంధ సంస్థ జమాత్ నుస్రత్ అల్ ఇస్లాం వల్ ముస్లిమిన్ (JNIM) ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో మాలీలో ఉన్న భారతీయులంతా అప్రమత్తంగా ఉండాలని విదేశాంగ శాఖ సూచించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

