PM Modi | మోదీకి ఘనా అత్యున్నత పురస్కారం
ప్రధాని మోదీకి (PM Modi) మరో అరుదైన గౌరవం లభించింది. పశ్చిమ ఆఫ్రికా దేశమైన ఘనా అత్యున్నత పురస్కారం అందుకున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఘనాలో పర్యటిస్తున్న మోదీకి.. ఆ దేశ అత్యున్నత పురస్కారం ‘ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా’తో సత్కరించింది.
PM Modi | ప్రధాని మోదీకి (PM Modi) మరో అరుదైన గౌరవం లభించింది. పశ్చిమ ఆఫ్రికా దేశమైన ఘనా అత్యున్నత పురస్కారం అందుకున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఘనాలో పర్యటిస్తున్న మోదీకి.. ఆ దేశ అత్యున్నత పురస్కారం ‘ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా’తో సత్కరించింది. బుధవారం ఘనా రాజధాని అక్రలో జరిగిన కార్యక్రమంలో ఆ దేశ అధ్యక్షుడు జాన్ ద్రమాని మహామా ఈ అవార్డును అందజేశారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘ఘనా జాతీయ గౌరవ దక్కడం నాకు చాలా గర్వకారణం, గౌరవం. ఇది భారత్-ఘనా మధ్య ఉన్న బలమైన, చిరకాల సంబంధాలకు నిదర్శనం. అధ్యక్షుడు మహామా, ఘనా ప్రభుత్వం, ఘనా ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. 140 కోట్ల మంది భారతీయుల తరపున నేను ఈ గౌరవాన్ని వినయంగా స్వీకరిస్తున్నారు. ఇది మన యువత ఆకాంక్షలు, వారి ఉజ్వల భవిష్యత్తుకు, మన గొప్ప సాంస్కతిక వైవిధ్యం, సంప్రదాయాలకు, భారతదేశం, ఘనా మధ్య చారిత్రక సంబంధాలకు అంకింతం చేస్తున్నాను’ అని అన్నారు.

కాగా, రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ బుధవారం రాత్రి ఘనా చేరుకున్నారు. మూడు దశాబ్దాల తర్వాత భారత ప్రధాని ఘనాకు వెళ్లడం ఇదే తొలిసారి. అక్రలోని కోటోకా అంతర్జాతీయ విమానాశ్రయంలో మోదీకి ఘనా స్వాగతం పలికి 21 తుపాకీలతో గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా ఘనా గడ్డపై తనకు లభించిన ఆత్మీయ స్వాగతం పట్ల ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. అధ్యక్షుడు స్వయంగా విమానాశ్రయానికి రావడం తనకు దక్కిన గొప్ప గౌరవమని అన్నారు. సంయుక్త ప్రకటన విడుదల చేస్తూ, భారతదేశం-ఘనా స్నేహానికి ప్రధాన అంశం మన ఉమ్మడి విలువలు, పోరాటం, సమ్మిళిత భవిష్యత్తు కోసం ఉమ్మడి కలలు అని, ఇది ఇతర దేశాలకు కూడా స్ఫూర్తినిచ్చిందని మోదీ వెల్లడించారు.
ఘనా పర్యటన అనంతరం మోదీ ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియాలో పర్యటించనున్నారు. ఈ నెల 3, 4వ తేదీల్లో ట్రినిడాడ్ అండ్ టోబాగోలో, 4, 5వ తేదీల్లో అర్జెంటీనాలో పర్యటిస్తారు. తర్వాత బ్రెజిల్లో 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు హాజరవుతారు. చివరగా నమీబియాలో పర్యటించి, స్వదేశానికి చేరుకుంటారు.
I thank the people and Government of Ghana for conferring ‘The Officer of the Order of the Star of Ghana’ upon me. This honour is dedicated to the bright future of our youth, their aspirations, our rich cultural diversity and the historical ties between India and Ghana.
This… pic.twitter.com/coqwU04RZi
— Narendra Modi (@narendramodi) July 2, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

