New Dalai Lama | కొత్త దలైలామాను ఎన్నుకుంటామని చేసిన చైనా చేసిన వ్యాఖ్యలపై 14వ టిబెటన్ బౌద్ధ ఆధ్యాత్మిక గురువు దలైలామా టెన్జిన్ గ్యాట్సో అలియాస్ లామా థోండుప్ కీలక వ్యాఖ్యలు చేశారు. 15వ దలైలామా ఎంపిక 600 సంవత్సరాల పురాతన బౌద్ధ సంప్రదాయాల ఆధారంగానే జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం తన ట్రస్ట్ గాడెన్ ఫోడ్రాంగ్ తీసుకుంటుందని.. ఇందులో చైనా పాత్ర ఏం ఉండదని స్పష్టం చేశారు. దలైలామా 90వ పుట్టినరోజు నాలుగు రోజుల ముందు ప్రారంభమైన టిబెటన్ ఆధ్యాత్మిక కార్యక్రమంలో దలైలామా ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలో చైనాతో కొత్త ఘర్షణలకు దారి తీసినట్లుగా పేర్కొంటున్నారు.
దలైలామా విడుదల చేసిన ఓ ప్రకటనలో బౌద్ధ సంప్రదాయాల ఆధారంగా తదుపరి దలైలామాను గుర్తించే హక్కు గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్‌కు మాత్రమే ఉందని అన్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకునే హక్కు మరెవరికీ లేదని స్పష్టం చేశారు. దలైలామా సంస్థను కొనసాగించాలని ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో నివసిస్తున్న టిబెటన్లు, టిబెటన్ బౌద్ధుల నుంచి నాకు వివిధ మార్గాల ద్వారా సందేశాలు వచ్చాయని.. దలైలామా సంస్థను కొనసాగించాలని తాను ధ్రువీకరిస్తున్నానన్నారు. తన తర్వాత దలైలామా సంస్థ కొనసాగుతుందని స్పష్టం చేశారు. గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్ టిబెటన్ బౌద్ధ సంప్రదాయాల అధిపతులు, దలైలామాల వంశానికి సమగ్రంగా అనుసంధానించబడిన, ప్రమాణం చేసిన నమ్మకమైన ధర్మ పరిరక్షకులను సంప్రదిస్తుందని చెప్పారు. ఇది సంప్రదాయం.. ప్రకారం శోధన, గుర్తింపు ప్రక్రియను పూర్తి చేస్తుందని తెలిపారు.
దలైలామా తన వారసుడు చైనా వెలుపల జన్మించాలని అన్నారు. బీజింగ్ నుంచి ఎంపిక చేసిన వ్యక్తిని ఎవరినైనా తిరస్కరించాలని ఆయన సూచించారు. దలైలామా 90వ పుట్టినరోజు వేడుకలు జూన్ 30న ధర్మశాల సమీపంలోని మెక్లియోడ్గంజ్లోని ప్రధాన ఆలయమైన సుగ్లగ్ఖాంగ్లో ప్రారంభమయ్యాయి. అదే సమయంలో లామా థోండప్ను వేర్పాటువాదిగా భావించే చైనా, శతాబ్దాల నాటి ఆచారం ద్వారా బీజింగ్ వారసుడి గుర్తింపును ఆమోదిస్తుందని చెప్పింది. టిబెటన్ సంప్రదాయంలో, ఒక సీనియర్ బౌద్ధ సన్యాసి ఆత్మ అతని మరణం తర్వాత ఒక పిల్లల శరీరంలో పునర్జన్మ పొందుతుందని నమ్ముతారు. దలైలామా వెబ్సైట్ ప్రకారం.. జూలై 6, 1935న ప్రస్తుత క్వింఘై ప్రావిన్స్‌లోని ఒక రైతు కుటుంబంలో లామో ధోండప్గా జన్మించిన 14వ దలైలామా. రెండేళ్ల వయసులో అలాంటి పునర్జన్మలలో ఒకరని గుర్తించారు.
చైనా దలైలామా వారసత్వ ప్రణాళికను తిరస్కరించింది. ఏదైనా భావి వారసుడికి తమ ఆమోదం ఉండాల్సిందేనని చెబుతున్నది. ఇది చైనా పాలక కమ్యూనిస్ట్ పార్టీతో టిబెటన్ బౌద్ధమతానికి దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదం కొత్త అధ్యయంగా మారబోతున్నది. దలైలామా వారసుడు మతపరమైన సంప్రదాయాలు, చట్టాలకు అనుగుణంగా దేశీయ గుర్తింపు, బంగారు కలశం ప్రక్రియ, చైనా ప్రభుత్వ ఆమోదం సూత్రాలను అనుసరించాలని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ పేర్కొన్నారు. 1959లో కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ నేతృత్వంలోని చైనా దళాలు టిబెట్‌ను ఆక్రమించుకున్న తర్వాత.. టిబెటన్ల పెద్ద సమూహంతో కలిసి భారత్‌ను ఆశ్రయించి దలైలామా ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. దలైలామా అప్పటి నుంచి ధర్మశాలను తన నివాసంగా చేసుకున్నారు. ఇది బీజింగ్‌కు మింగుడుపడని అంశంగా మారింది. ఆయన ఉనికి చైనా, భారత్ మధ్య వివాదంగా మిగిలిపోయింది. టిబెటన్ స్వయంప్రతిపత్తి కోసం పోరాటం ఆయన వారసుడు సైతం కొనసాగించాల్సిన పరిస్థితి ఉన్నది. అయితే వారసత్వంలో జోక్యం చేసుకోవడం మానేయాలని, మత స్వేచ్ఛను గౌరవించాలని చైనాను కోరుతూనే ఉంటుందని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి తెలిపారు.
టిబెట్ ప్రజలు చైనా ఎంచుకునే వారసుడిని అంగీకరించరని టిబెట్ అధ్యోడు పెన్పా షెరింగ్ సిక్యోంగ్ అన్నారు. టిబెట్ లోపల, వెలుపల ఉన్న టిబెటన్లు జాతీయ ఐక్యతను కాపాడుకోవడానికి, దలైలామా గొప్ప కోరికలు, ఆకాంక్షలు ఆకాంక్షలను నెరవేర్చడానికి హృదయపూర్వకంగా సహకరించాలని ప్రతిజ్ఞ చేశారని ఆయన అన్నారు. టిబెటన్ భాష, మతాన్ని లక్ష్యంగా చేసుకుని టిబెటన్ గుర్తింపును తుడిచిపెట్టడానికి చైనా ప్రభుత్వం కుట్ర పన్నుతోందని, దీన్ని అంగీకరించబోమని ఆయన అన్నారు. బహిష్కృత టిబెటన్లకు సహాయంలో కోతను అమెరికా ఉపసంహరించుకుందని టిబెటన్ ప్రభుత్వం తెలిపింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం, విద్య వంటి ప్రాజెక్టులకు 7 మిలియన్ డాలర్ల సహాయం ఇవ్వాలని నిర్ణయించారు. జనవరిలో అధికారంలోకి వచ్చిన వెంటనే, ట్రంప్ పరిపాలన అమెరికా ఫస్ట్ ప్రచారం కింద టిబెట్‌కు విదేశీ సహాయాన్ని తగ్గించడం మొదలుపెట్టింది.