Mark Zuckerberg | ఓవల్ ఆఫీస్ (Oval Office)లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అధ్యక్షతన అత్యంత రహస్యంగా జరుగుతున్న సమావేశంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. సమావేశం జరుగుతున్న గదిలోకి అనూహ్యంగా మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) ఎంట్రీ ఇచ్చినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది.
యుద్ధ విమానాల సామర్థ్యంపై అత్యంత రహస్యంగా జరుగుతున్న ఈ మీటింగ్‌లోకి సడెన్‌గా మెటా బాస్ రావడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి. ఎలాంటి సెక్యూరిటీ క్లియరెన్స్ లేకుండానే జుకర్‌బర్గ్ ఈ సమావేశం లోపలికి వెళ్లినట్లు నివేదించాయి. అక్కడ ఉన్న సిబ్బంది మెటా బాస్‌ను సున్నితంగా బయటకు వెళ్లిపోవాలని చెప్పినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి. ఈ ఘటన ఈ ఏడాది మార్చిలో జరిగినట్లు తెలుస్తోంది.
అయితే, ఈ ఘటనపై వైట్‌హౌస్ (White House) సీనియర్ అధికారి ఒకరు స్పందించారు. ఆ ఘటనను కొన్ని మీడియా సంస్థలు తప్పుగా వర్ణించాయని పేర్కొన్నారు. ఈ మేరకు ఆ వార్తలను తోసిపుచ్చారు. ‘అధ్యక్షుడి అభ్యర్థన మేరకే హలో చెప్పడానికి మెటా బాస్ లోపలికి వచ్చారని’ తెలిపారు. ‘ట్రంప్ అభ్యర్థన మేరకే జుకర్‌బర్గ్ లోపలికి వచ్చారు. అధ్యక్షుడికి హలో చెప్పి బయటకు వెళ్లారు. ట్రంప్‌తో భేటీ ప్రారంభమయ్యే వరకూ అక్కడే వేచి ఉన్నారు. సైనికాధికారులతో మీటింగ్ పూర్తైన తర్వాత వీరిద్దరూ భేటీ అయ్యారు’ అని సదరు అధికారి తెలిపారు.
Also Read..
Air India | ఎయిర్ ఇండియాకు చెందిన మరో డ్రీమ్‌లైనర్ విమానంలో సమస్య.. వియన్నాలో నిలిపివేత
social media accounts | పాక్ సెలబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలను మరోసారి బ్లాక్ చేసిన భారత్
Mohammed Shami | రూ.4లక్షలు చాలా తక్కువ.. కోర్టు తీర్పుపై షమీ మాజీ భార్య