Inayat Vats | 20 ఏళ్ల క్రితం తండ్రి మరణం.. ఆయన యూనిఫాం ధరించి ఆర్మీలో చేరిన యువతి
Inayat Vats | దేశం కోసం ప్రాణాలు అర్పించిన తన తండ్రి మిలిటరీ యూనిఫాం (Father Uniform) ధరించి ఓ యువతి భారత ఆర్మీ (Indian Army) లో అత్యున్నత పదవి చేపట్టింది.
Inayat Vats | దేశం కోసం ప్రాణాలు అర్పించిన తన తండ్రి మిలిటరీ యూనిఫాం (Father Uniform) ధరించి ఓ యువతి భారత ఆర్మీ (Indian Army) లో అత్యున్నత పదవి చేపట్టింది. తండ్రి అడుగు జాడల్లోనే నడుస్తూ తన జీవితాన్ని దేశ సేవకు అంకితం చేసింది.
దాదాపు 20 ఏళ్ల క్రితం మేజర్ నవ్‌నీత్ వాట్స్ జమ్మూకశ్మీర్‌లో విధులు నిర్వహిస్తూ అమరుడయ్యారు. అయితే, మూడేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయిన ఆయన కుమార్తె ఇనాయత్ వాట్స్ (Inayat Vats) .. తండ్రి దేశభక్తిని పుణికిపుచ్చుకుని తాజాగా సైన్యంలో చేరింది. ఆర్మీలో అత్యున్నత పదవి చేపట్టింది. ఇటీవలే చెన్నైలోని ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీలో విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న ఇనాయత్.. మిలిటరీ ఇంటెలిజెన్స్ విభాగంలో లెఫ్టినెంట్‌గా ( Lieutenant) బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా జరిగిన పాసింగ్ ఔట్ పరేడ్‌కు ఆమె తన తండ్రి యూనిఫాం ధరించి అక్కడున్న వారందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సందర్భంగా ఆమెకు స్వాగతం పలుకుతూ ఇండియన్ ఆర్మీ పోస్టు పెట్టింది. ఆర్మీ డాటర్ లెఫ్టినెంట్ ఇనాయత్ వాట్స్కు స్వాగతం అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. ఇనాయత్ ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. 2023 ఏప్రిల్‌లో ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (Officers Training Academy)లో చేరింది.
కాగా, చండీగఢ్‌కు చెందిన మేజర్ నవ్‌నీత్ వాట్స్ 3 గోర్ఖా రైఫిల్స్ రెజిమెంట్‌లోని 4వ బెటాలియన్‌లో విధులు నిర్వర్తించారు. 2003 నవంబర్‌లో శ్రీనగర్‌లో ఆర్మీ చేపట్టిన ఉగ్రవాద ఏరివేత చర్యల్లో ఆయన అమరుడయ్యారు. ఆ సమయంలో అత్యున్నత ధైర్యసాహసాలను ప్రదర్శించిన మేజర్ నవ్‌నీత్ వాట్స్కు కేంద్రం శౌర్య పురస్కారం ప్రకటించింది.
Also Read..
Sachin Tendulkar | వాంఖడే స్టేడియానికి 50 ఏళ్లు.. ఇది నాకు రెండో ఇల్లు అంటూ సచిన్ ఆసక్తికర ట్వీట్
Oscars 2024 | ఆస్కార్ వేదికపై మరోసారి మెరిసిన ఆర్ఆర్ఆర్.. VIDEO
Yogi Adityanath | డీప్‌ఫేక్ బారినపడ్డ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

