Yogi Adityanath | డీప్‌ఫేక్ బారినపడ్డ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
Yogi Adityanath | ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి (UP CM) యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) డీప్‌ఫేక్ బారిన పడ్డారు.
Yogi Adityanath | డీప్‌ఫేక్ వీడియోస్ (Deepfake Videos).. ఈ పదం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. కృత్రిమ మేధ (Artificial Intelligence) ను ఉపయోగించి సృష్టిస్తున్న ఇలాంటి వీడియోలపై ప్రముఖుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. సమాజానికి ముప్పుగా మారుతున్న ఇలాంటి వీడియోలు, ఫొటోల కట్టడికి కేంద్రం చర్యలు చేపట్టింది. అయినా ఎలాంటి ప్రయోజనం లేదు. కొందరు విచ్చలవిడిగా ఏఐని ఉపయోగించి ప్రముఖుల వీడియోలను యథేచ్ఛగా మార్ఫింగ్ చేస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలు, రాజకీయనేతల మార్ఫింగ్ వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి (UP CM) యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) ఈ డీప్‌ఫేక్ బారిన పడ్డారు.
డయాబెటిస్ ఔషధానికి యోగి ప్రచారం చేస్తున్నట్లు ఉన్న ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటనపై సైబర్ క్రైం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐపీ అడ్రెస్ ఆధారంగా వీడియో సృష్టించిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. కాగా, ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, ప్రముఖ నటులు రష్మిక మందన్న, కత్రినా కైఫ్, కాజోల్, ఆలియా భట్ వంటి తదితర స్టార్ నటులకు చెందిన నకిలీ వీడియోలు వైరల్ అయిన విషయం తెలిసిందే.
Also Read..
Pakistan | పాక్ 14వ అధ్యక్షుడిగా అసిఫ్ అలీ జర్దారీ ప్రమాణం
David Miller | ప్రేయసిని పెళ్లాడిన గుజరాత్ హిట్టర్.. కొత్తజంట లవ్‌స్టోరీ తెలుసా..?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delimitation | ఎవరికి లాభం.. ఎవరికి నష్టం.. డీలిమిటేషన్‌పై బీజేపీ, కాంగ్రెస్ సొంత వ్యూహాలు?
Deeksha Divas | ఉద్యమానికి ఊపిరిలూదిన దీక్షా దివస్.. నేడు కరీంనగర్ గడ్డపై స్ఫూర్తి సభ
Regional Parties | 816కు సీట్లు పెరిగినా సంకీర్ణమే.. 2029 ఎన్నికలకల్లా జాతీయ పార్టీలు మరింత ఖల్లాస్!
KCR | కూటమి నీతితో ఓటమిని గెలిచి.. కేసీఆర్ బ్రహ్మాస్త్రం
Horoscope | 29-11-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

