Heatwave : ఉత్తరాదిలో వడగాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ, పంజాబ్, హరియాణ, యూపీ, రాజస్ధాన్, మధ్యప్రదేశ్లో రాబోయే మూడు రోజుల్లో భానుడి భగభగలు కొనసాగుతాయని, ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరతాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరించింది.
దేశ రాజధానిలో శనివారం ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటుతుందని అంచనా వేసింది. గడిచిన 24 గంటల్లో ఒడిషాలోని నౌపడలో అత్యధికంగా 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. పంజాబ్, హరియాణ, యూపీ, తూర్పు రాజస్ధాన్, బిహార్, గుజరాత్, మధ్యప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో వడగాలులు కొనసాగుతాయని ఐఎండీ పేర్కొంది.
మే 18, మే 19న ఢిల్లీలో వడగాలులు తీవ్రంగా ఉంటాయని అంచనా వేసింది. ఈ ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వడదెబ్బకు గురికాకుండా అవసరమైన జాగ్రతలు తీసుకోవాలని సూచించింది.
Read More :
Shyam Rangeela | వారణాసిలో మోదీపై పోటీ.. కమెడియన్ శ్యామ్ రంగీలాకు ఝలక్ ఇచ్చిన అధికారులు