Shyam Rangeela | వారణాసిలో మోదీపై పోటీ.. కమెడియన్ శ్యామ్ రంగీలాకు ఝలక్ ఇచ్చిన అధికారులు
Shyam Rangeela | వారణాసిలో మోదీపై పోటీకి దిగిన ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్, కమెడియన్ శ్యామ్ రంగీలా (Shyam Rangeela)కు ఎన్నికల అధికారులు ఝలక్ ఇచ్చారు.
Shyam Rangeela | ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి (Varanasi) లోక్‌సభ స్థానానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే వారణాసిలో మోదీపై పోటీకి దిగిన ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్, కమెడియన్ శ్యామ్ రంగీలా (Shyam Rangeela)కు ఎన్నికల అధికారులు ఝలక్ ఇచ్చారు. ఆయన నామినేషన్‌ను తిరస్కరించారు (Nomination Rejected). నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతోనే ఆయన నామినేషన్‌ను తిరస్కరించినట్లు స్పష్టం చేశారు.
నామినేషన్ తిరస్కరణపై రంగీలా స్పందించారు. ఈ మేరకు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నామినేషన్ సందర్భంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెప్పారు. నామినేషన్ దాఖలకు ఎన్నిసార్లు ప్రయత్నించినా జిల్లా యంత్రాంగం తనను అనుమతించలేదని ఆరోపించారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా శ్యామ్ రంగీలా పోస్ట్ పెట్టారు. ముందుగా మే 10, 13 తేదీల్లో నామినేషన్ వేయడానికి ప్రయత్నించి విఫలమైనట్లు చెప్పారు. అనంతరం చివరిరోజైన మే 14న నామినేషన్ వేయడానికి వెళ్లగా.. అధికారుల నుంచి ఎలాంటి స్పందనా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఎలాగోలా చివరి నిమిషంలో నామినేషన్ వేసినట్లు వివరించారు. ఇప్పుడు ఎన్నికల సంఘం చర్యను చూసి నవ్వాలో..? ఏడవాలో..? తెలియట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, రాజస్థాన్‌కు చెందిన శ్యామ్ రంగీలా.. ప్రధాని మోదీ గొంతును అనుసరిస్తూ సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారు. ఇక ఈ ఎన్నికల్లో ప్రధానిపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగారు.
వారణాసి స్థానం నుంచి మొత్తం 55 మంది బరిలోకి దిగి నామినేషన్ దాఖలు చేశారు. అందులో 36 పత్రాలను అధికారులు తిరస్కరించారు. ఇందులో శ్యామ్ రాంగీలా నామినేషన్ కూడా ఉంది. ప్రస్తుతం వారణాసి బరిలో 15 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇక ప్రధాని మోదీపై కాంగ్రెస్ నుంచి అజయ్ రాయ్ బరిలోకి దిగారు. వారణాసి స్థానానికి జూన్ 1న పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.
Also Read..
Naresh Goyal | జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ భార్య కన్నుమూత
Encounter | కుప్వారాలోని నియంత్రణ రేఖ వద్ద ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

