Aishwarya Rai Bachchan | చేతికి కట్టుతో కేన్స్ ఫిల్మ్‌ఫెస్టివల్‌కు బయల్దేరిన ఐశ్వర్యరాయ్ బచ్చన్.. వీడియో
Aishwarya Rai Bachchan | ఫ్రాన్స్ వేదికగా జరిగే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ (Cannes Film Festival)కు బాలీవుడ్ స్టార్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ బయల్దేరారు. గాయం కారణంగా చేతికి కట్టుతోనే కుమార్తెతో కలిసి ఐశ్వర్య ఫ్రాన్స్‌కు పయనమైంది.
Aishwarya Rai Bachchan | అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఫ్రాన్స్‌లో జరిగే కేన్స్‌కు ప్రత్యేకత ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎందరో సినీ తారలు ఈ కార్యక్రమంలో పాల్గొని రెడ్ కార్పెట్‌పై సందడి చేస్తుంటారు. ఈ కేన్స్ వేడుకల్లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ బచ్చన్ (Aishwarya Rai Bachchan) ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటారు. విభిన్న కాస్ట్యూమ్స్‌తో అలరిస్తుంటుంది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ (Cannes Film Festival)కు కొత్త కళ తెస్తుంటుంది ఐశ్వర్య. ఆమె రెడ్ కార్పెట్‌పై అలా నడుచుకూంటూ వస్తుంటే కెమెరా కళ్లన్నీ ఐష్ (Aish)వైపే ఉంటాయి. అయితే, ఈ సారి ఆమె గాయంతోనే కేన్స్‌లో పాల్గొనబోతోంది. గాయం కారణంగా చేతికి కట్టుతోనే కుమార్తెతో కలిసి ఐశ్వర్య ఫ్రాన్స్‌కు పయనమైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఫ్రాన్స్ వేదికగా ఏటా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ (Cannes 2023) అట్టహాసంగా జరుగుతుందన్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన సినీ తారలు, మోడళ్లు, డిజైనర్లు, పలువురు సెలబ్రిటీలు ఈ వేడుకలో పాల్గొని విభిన్న ఫ్యాషన్ దుస్తుల్లో రెడ్ కార్పెట్ (Red Carpet)పై హొయలుపోతుంటారు. బాలీవుడ్ నుంచి కూడా పలువురు తారలు హాజరై ట్రెండీ దుస్తులు ధరించి అందరినీ ఆకర్షిస్తుంటారు. ఇక ఏటా ఐశ్వర్య ఈ వేడుకలకు కచ్చితంగా హాజరవుతుంటుంది. కొత్త కొత్త కాస్ట్యూమ్స్ ధరించి తళుక్కున మెరిసి ఆకట్టుకుంటుంటుంది. అయితే, ఈ సారి ఆమె గాయంతోనే కేన్స్ వేడుకల్లో సందడి చేసేందుకు సిద్ధమైంది.
Also Read..
Naresh Goyal | జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ భార్య కన్నుమూత
PhonePe | భారత పర్యాటకులకు గుడ్‌న్యూస్.. శ్రీలంకలో ఫోన్‌పే సేవలు..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

