Syed Mustafa Kamal | ఓ వైపు భారత్ చంద్రుడిపై అడుగుపెడుతుంటే.. పాక్‌లో పిల్లలు గట్టర్లలో పని చనిపోతున్నారని పాకిస్థాన్ ఎంపీ సయ్యద్ ముస్తాఫా కమల్ అన్నారు. పాకిస్థాన్ రాజకీయ పార్టీ ముత్తాహిదా క్వామీ మూవ్మెంట్ పాకిస్థాన్ (MQM-P) ఎంపీ సయ్యద్ ముస్తఫా కమల్ పాకిస్థాన్ పార్లమెంట్లో ప్రసంగిస్తూ దేశ సమస్యలను ప్రస్తావించారు. బుధవారం జాతీయ అసెంబ్లీలో మాట్లాడారు. ‘ప్రపంచం చంద్రుడి మీదకు వెళ్తున్నది. ఇక్కడ కరాచీ పరిస్థితి ఏంటంటే.. చాలామంది చిన్నారులు తెరిచిన మురికి కాల్వల్లో పడి ప్రాణాలు కోల్పోతున్నారు. అదే సమయంలో భారత్ చంద్రుడిపై ల్యాండ్ అయిందన్న వార్తలు వస్తున్నాయి.
ఇక్కడ కరాచీలో ఓ పిల్లాడు కాలువలో పడి మరణించినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రతీ మూడో రోజూ ఇలాంటి వార్తలు సర్వసాధారణంగా మారాయి’ అంటూ పాక్‌లోని పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన కరాచీలోని మంచినీటి కొరతపై స్పందించారు. ‘కరాచీ పాకిస్థాన్‌కు ఆదాయ ఇంజిన్. దేశంలో రెండు ఓడరేవులు ఉన్నాయి. రెండూ కరాచీలోనే ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇది దేశానికి గేట్‌వే. కరాచీకి 15 ఏళ్లుగా పరిశుభ్రమైన మంచినీరు అందడం లేదు. మంచినీళ్ల ట్యాంకు సైతం చోరీకి గురవుతున్నాయి. నీటి మాఫియా ట్యాంకుల నీళ్లు కరాచీ ప్రజలకు అమ్మి సొమ్ము చేసుకుంటుంది’ అన్నారు.
సింధ్ ప్రావిన్స్‌లో దాదాపు 70లక్షల మంది పిల్లలు పాఠశాలలకు వెళ్లడం లేదని.. జాతీయ స్థాయిలో 2.6కోట్లుగా ఉందన్నారు. కరాచీ సింధ్ ప్రావిన్స్ రాజధాని. 48వేల పాఠశాలలున్నాయని.. 11వేల పాఠశాలలు ఖాళీగా ఉన్నట్లు నివేదిక తెలుపుతుందని.. దేశంలో 2.62 కోట్ల మంది పిల్లలు బడికి వెళ్లడం లేదని.. ఇది 70 దేశాల్లోని జనాభా కంటే ఎక్కువని వాపోయారు. చదువుకోని పిల్లలు దేశ ఆర్థికాభివృద్ధి మొత్తాన్ని నాశనం చేస్తున్నారని కమల్ పేర్కొన్నారు. మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. భారత్, పాకిస్థాన్ కలిసి స్వాతంత్య్రం పొందాయని.. కానీ నేడు (భారత్) అగ్రరాజ్యంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారు.. తాము కలలు కంటున్నామన్నారు. ఈ క్రమంలోనే ముస్తాఫా కమల్ స్పందించారు.
سید مصطفیٰ کمال نے ببانگ دہل کراچی کا مقدمہ پارلیمنٹ میں کھلے الفاظ میں پیش کیا۔ سنئے#Pakistan #Sindh #Karachi #MQMP #PTI #PPP #President #AsifAliZardari #Bilawal #MustafaKamal #Nation #NationalAssembly #Parliament pic.twitter.com/7B8wKPIYP7
— Syed Mustafa Kamal (@KamalMQM) May 15, 2024