Naresh Goyal | జెట్ ఎయిర్వేస్ ఫౌండర్ (Jet Airways founder) నరేశ్ గోయల్ (Naresh Goyal) భార్య అనితా గోయల్ (Anita Goyal) కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్ (cancer) వ్యాధితో బాధపడుతున్న ఆమె ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, ఆరోగ్యం క్షీణించడంతో గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. కాగా, నరేశ్ గోయల్ కూడా గత కొన్ని రోజులుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే.
మరోవైపు, కెనరాబ్యాంకుకు చెందిన రూ.538 కోట్ల ఫ్రాడ్ కేసులో నరేశ్ గోయల్ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో గోయల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు గతేడాది సెప్టెంబర్ ఒకటో తేదీన అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రైవేట్ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్కు కెనరాబ్యాంకు ఇచ్చిన రూ.848.86 కోట్ల రుణంలో జెట్ ఎయిర్వేస్ రూ.538.62 కోట్ల రుణం చెల్లించలేదు. దీంతో కెనరాబ్యాంకు ఫిర్యాదు మేరకు సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. జెట్ ఎయిర్వేస్ యాజమాన్యం మోసగించిందని నిర్ధారించింది. ఇదే కేసులో హవాలా లావాదేవీలు జరిగినట్లు గుర్తించిన ఈడీ కూడా దర్యాప్తు చేపట్టి గత సెప్టెంబర్ ఒకటో తేదీన నరేశ్ గోయల్‌ను అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి జైల్లో ఉన్న ఆయన భార్య అనారోగ్యం కారణంగా ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చారు. అతడు జైలు నుంచి వచ్చిన అతికొద్ది రోజుల్లోనే ఆమె మరణించడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
Also Read..
Robert Fico | ప్రధాని రాబర్ట్ ఫికోపై కాల్పులు.. ఖండించిన బైడెన్, పుతిన్
Pak cricketer | పనిచేసే ఆడవాళ్ల వల్లే ఈ దుస్థితి.. పాక్ మాజీ క్రికెటర్ వివాదాస్పద వ్యాఖ్యలు
Protein gel | ‘మద్యం’ హ్యాంగోవర్‌కు చెక్.. కొత్త ప్రొటీన్ జెల్ తయారీ..!