Robert Fico | స్లోవేకియా ప్రధాని రాబర్ట్ ఫికోపై జరిగిన దాడిని ప్రపంచ నేతలు ఖండించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఫికో పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బుధవారం హ్యాండ్లోవాలో బుధవారం ఫికోపై కాల్పులు జరిగిన విషయం తెలిసింది. ప్రస్తుతం ఆయన బన్స్కా బిస్ట్రికా నగరంలో చికిత్స పొందుతున్నాడు. కాల్పులు జరిపిన వ్యక్తిని అక్కడికక్కడే అరెస్టు చేసి ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించారు. ఈ దాడిని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ ఖండించారు. ఫికో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ‘తమ ఆలోచలన్నీ ఆయన కుటుంబం, స్లోవేకియా ప్రజలతోనే ఉన్నాయి.
త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఈ భయంకరమైన హింసాత్మక చర్యను ఖండిస్తున్నాం. ఎంబసీ స్లోవేకియా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది’ అంటూ బైడైన్ ట్వీట్ చేశారు. బ్రిటన్ ప్రధాని రిషి సునక్ కూడా సైతం స్పందించారు. ఘటన గురించి విని షాక్ అయ్యానని ట్వీట్ చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఫికోపై దాడిని ఖండిస్తూ ఖండించారు. దాడి ఘటనను ‘రాక్షసమైన నేరం’గా అభివర్ణించారు. ఫికో ధైర్యవంతుడని.. దృఢమైన వ్యక్తి అని తెలుసునన్నారు. లక్షణాలు అతనికి క్లిష్ట పరిస్థితిని తట్టుకోవడంలో సహాయపడతాయన్నారు. ఫికో త్వరగా, పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కూడా దాడిని తీవ్రంగా ఖండించారు.