సోమవారం 26 అక్టోబర్ 2020
National - Sep 09, 2020 , 16:15:42

పార్టీకోసం గ్లాస్‌ సిద్ధం చేసుకుంటున్న ఆక్టోప‌స్ : వీడియో వైర‌ల్‌

పార్టీకోసం గ్లాస్‌ సిద్ధం చేసుకుంటున్న ఆక్టోప‌స్ :  వీడియో వైర‌ల్‌

భూమి ప్లాస్టిక్ వ్యర్థాల‌తో క‌లుషితం అయిపోయింది. బీచ్‌లు, మ‌హాస‌ముద్రాలు ఇలా ఎక్క‌డ చూసిన ప్లాస్టిక్ ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. స‌ముద్రంలో జీవించే జీవుల‌ నాశ‌నానికి ప్లాస్టికే ప్ర‌ధాన కార‌ణం. ప్లాస్టిక్ గురించి అవ‌గాహ‌నా కార్య‌క్ర‌మాలు క‌ల్పిస్తున్న‌ప్ప‌టికీ ఎలాంటి మార్పు రావ‌డం లేదు. ఈ ప్లాస్టిక్ శ‌రీరంలో చేర‌డం వ‌ల్ల ఎన్నో జంతువులు ప్రాణాలు వ‌దులుతున్నాయి. ఇప్పుడు మ‌రో జీవి ఆ ప‌నిలోనే ఉంది. ఒక ఆక్టోప‌స్ ప్లాస్టిక్ గ్లాసును ప‌ట్టుకొని ఎక్క‌డికో మోసుకెళ్తున్న‌ది. దీనికి సంబంధించిన వీడియోను ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ ఆఫీస‌ర్ ట్విట‌ర్‌లో షేర్ చేశారు.

'రాత్రి పార్టీకి గ్లాస్ తీసుకెళ్తుంది' అనే శీర్షిక‌ను జోడించారు నందా. ప్ర‌పంచం ఇనుప యుగం నుంచి ప్లాస్టిక్ యుగం వ‌ర‌కు వ‌చ్చిందంటున్న‌నారు. ప్లాస్టిక్ వాడ‌కం త‌గ్గించండి. రీసైకిల్ చేసి వాడండి అంటున్నారు నందా. 11 సెకండ్ల వీడియో చూసిన నెటిజ‌న్లు బాధ‌ను వ్య‌క్తం చేస్తున్నారు. 'ఈ దృశ్యం చాలా విచార‌క‌ర‌మైన‌ది. మ‌నం చేసిన త‌ప్పుల‌కు అభం సుభం తెలియ‌ని జీవులు బ‌లైపోతున్నాయి' అంటూ ఓ నెటిజ‌న్ వాపోయారు. logo