Mallikarjun Kharge | వచ్చే ఏడాది మోదీ తన ఇంటిపై జెండా ఎగురవేస్తారు.. ప్రధాని ప్రసంగంపై మండిపడ్డ ఖర్గే
Mallikarjun Kharge | 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని మోదీ (PM Narendra Modi) చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
Mallikarjun Kharge | 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని మోదీ (PM Narendra Modi) చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘వచ్చే ఏడాది ఎర్రకోట వద్ద కలుద్దాం’ అన్న మోదీ వ్యాఖ్యలపై ఖర్గే స్పందిస్తూ.. ప్రధాని వ్యాఖ్యలు ఆయన అహంకారాన్ని చూపిస్తున్నాయని అన్నారు. వచ్చే ఏడాది ఎర్రకోటపై కాకుండా.. మోదీ తన ఇంటి వద్ద జెండా ఎగురవేస్తారని వ్యాఖ్యానించారు.
స్వాతంత్య్ర దినోత్సవం ( Independence Day) సందర్భంగా నేడు ప్రధాని మోదీ ఎర్రకోట (Red Fort )పై జెండా ఎగురవేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగిస్తూ.. వచ్చే ఏడాది మళ్లీ ఆగస్టు 15న వస్తానని, ఎర్రకోటపై జెండా ఎగురవేస్తానంటూ వ్యాఖ్యానించారు. ప్రధాని వ్యాఖ్యలపై ఖర్గే స్పందిస్తూ.. ‘ఆయన (ప్రధాని మోదీ) వచ్చే ఏడాది జెండా ఎగురవేస్తారు. కానీ, అది ఆయన ఇంటిపైనే. జయాపజయాలు నిర్ణయించేది ప్రజలు. అది ఓటర్ల చేతుల్లో ఉంది. 2024లో మరోసారి జెండా ఎగురవేస్తానని 2023లోనే చెప్పడం మోదీ అహంకారాన్ని చూపిస్తోంది’ అని ఖర్గే వ్యాఖ్యానించారు.
అందుకే హాజరుకాలేకపోయా..
మరోవైపు ఎర్రకోటలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరుకాలేకపోవడానికి గల కారణాలను ఖర్గే వివరించారు. తనకు కంటి సంబంధిత సమస్యలు ఉన్నాయని అందువల్లనే ప్రధాని ప్రసంగానికి హాజరు కాలేకపోయానని తెలిపారు. ‘మొదట నాకు కంటి సంబంధిత సమస్యలు ఉన్నాయి. రెండోది, ప్రోటోకాల్ ప్రకారం ఉదయం 9.20 గంటలకు నా నివాసంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాను. అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వచ్చి జెండాను ఎగురవేశాను. దానికి తోడు భద్రత చాలా పటిష్టంగా ఉంది. భద్రతా దళాలు ప్రధానిని తప్ప ఎవరినీ ముందుకు వెళ్లనీయడం లేదు. దీంతో సమయానికి ఎర్రకోట వద్దకు రాలేనని అనుకున్నా. అందుకే భద్రతా కారణాలు, సమయభావం కారణంగా అక్కడికి వెళ్లకపోవడమే మంచిదని భావించా’ అని ఖర్గే వివరించారు.
Also Read..
Rishabh Pant | అభిమానులకు గుడ్ న్యూస్.. రీఎంట్రీకి సిద్ధమైన పంత్..!
Burj Khalifa | బుర్జ్ ఖలీఫాపై రెపరెపలాడిన మువ్వన్నెల జెండా.. వీడియో
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

