Burj Khalifa | బుర్జ్ ఖలీఫాపై రెపరెపలాడిన మువ్వన్నెల జెండా.. వీడియో
Burj Khalifa | నేడు భారత్ 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనమైన దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా (Burj Khalifa)పై భారత జెండా (Indian Flag)ను ప్రదర్శించారు.
Burj Khalifa | నేడు భారత్ 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు (Independence Day) ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగిన వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొని జెండాను ఎగురవేశారు. తెలుగు రాష్ట్రాల్లోనూ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జెండాను ఆవిష్కరించి ప్రసంగించారు.
కాగా, 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనమైన దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా (Burj Khalifa)పై భారత జెండా (Indian Flag)ను ప్రదర్శించారు. అర్ధరాత్రి 12 గంటల ఒక్క నిమిషానికి బుర్జ్ ఖలీఫాపై ఎల్ఈడీ లైట్లతో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. ఆ సమయంలో భారత జాతీయ గీతం కూడా వినిపించింది. ఈ అద్భుత దృశ్యాలను చూసిన అక్కడి భారత ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Indian flag on Burj Khalifa.
Happy Independence to all…!!!! 🇮🇳 pic.twitter.com/iyTKILAoj4
— Johns. (@CricCrazyJohns) August 14, 2023
పాక్‌కు ఘోర అవమానం..
మరోవైపు ఆగస్టు 14న స్వాతంత్ర్య వేడుకలను జరుపుకుంటున్ను పాకిస్థాన్ (Pakistan)కు ఘోర అవమానం జరిగింది. సాధారణంగా స్వాతంత్య్ర వేడుకలను జరుపుకునే దేశాల జెండాలను ఎత్తైన భవనంపై ప్రదర్శిస్తుంటారు. దీంతో పాకిస్థానీ ప్రజలు కూడా తమ దేశ జెండాను బుర్జ్ ఖలీఫాపై చూసుకునేందుకు అక్కడికి తరలివచ్చారు. అర్ధరాత్రి దాటినా కూడా తమ జెండా కనిపించకపోవడంతో వారు తీవ్ర నిరాశ చెందారు. అయితే, భారత జాతీయ జెండా మాత్రం యథాతథంగా ప్రదర్శితమైంది. బుర్జ్ ఖలీఫా వద్ద పాక్ జాతీయులు గుమిగూడిన వీడియోలు సైతం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
https://twitter.com/pardhivnamburu/status/1691318972208308224?s=20
https://twitter.com/HEMANTHSAI45/status/1691175162035712000?s=20
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

