అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కూలిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం నుంచి ఒక డాక్టర్ (Gujarat Doctor) తప్పించుకున్నాడు. ఆయనకు జ్వరం రావడంతో లండన్‌కు వెళ్లవద్దని భార్య చెప్పింది. దీంతో జూన్ 12న బుక్ చేసుకున్న ఎయిర్ ఇండియా విమానం టికెట్‌ను ఆయన రద్దు చేసుకున్నాడు. గుజరాత్‌లోని మహిసాగర్ జిల్లా కోయ్డామ్ గ్రామానికి చెందిన డాక్టర్ ఉమాంగ్ పటేల్ ఐదేళ్లుగా బ్రిటన్‌లో నివసిస్తున్నాడు. మే 24న భార్య, పిల్లలు, తల్లిదండ్రులతో కలిసి భారత్‌కు వచ్చాడు. కుటుంబాన్ని గుజరాత్లో ఉంచి ఒక్కడే లండన్ తిరిగి వెళ్లేందుకు తొలుత జూన్ 2కు ఎయిర్ ఇండియా విమానం టికెట్ బుక్ చేసుకున్నాడు.
కాగా, డాక్టర్ అయిన ఉమాంగ్ పటేల్ తండ్రికి గుండెపోటు వచ్చింది. దీంతో జూన్ 2 ఎయిర్ ఇండియా విమాన టికెట్‌ను అతడు రద్దు చేసుకున్నాడు. జూన్ 12కు బుక్ చేసుకున్నాడు. అయితే జూన్ 9న ఉమాంగ్ పటేల్ తన భార్య, పిల్లలతో కలిసి అత్తవారింటికి వెళ్లాడు. అక్కడ అతడికి తీవ్రమైన జ్వరం వచ్చింది. దీంతో భార్య ఆందోళన చెందింది. జూన్ 12న లండన్ ప్రయాణాన్ని వాయిదా వేసుకోమని చెప్పింది. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని వెళ్లమని సలహా ఇచ్చింది.
మరోవైపు భార్య సూచనను ఉమాంగ్ పటేల్ పాటించాడు. జూన్ 12న ప్రయాణించాల్సిన ఎయిర్ ఇండియా విమాన టికెట్‌ను రద్దు చేసుకున్నాడు. జూన్ 15న లండన్ వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకున్నాడు.
కాగా, జూన్ 12న అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా విమానం కొన్ని క్షణాల్లోనే కూలి పేలిపోయింది. ఈ ప్రమాదంలో 229 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది, 29 మంది ఇతర వ్యక్తులతో సహా సుమారు 270 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు.
మరోవైపు ఈ విషయం తెలుసుకుని డాక్టర్ ఉమాంగ్ పటేల్, అతడి కుటుంబ సభ్యులు, బంధువులు షాక్ అయ్యారు. విమాన ప్రమాదం దుర్ఘటనపై ఆయన స్పందించారు. జ్వరంతో బాధపడిన తాను భార్య సూచన వల్ల టికెట్ రద్దు చేసుకున్నట్లు తెలిపారు. ‘దేవుడు నన్ను రక్షించాడు. ఆ విమానంలో ఉన్న వారందరికీ దేవుడు శాంతిని ప్రసాదించాలని నేను ప్రార్థిస్తున్నా’ అని డాక్టర్ ఉమాంగ్ పటేల్ మీడియాతో అన్నారు.
Also Read:
270 saplings planted | విమాన ప్రమాద మృతులకు నివాళిగా.. 270 మొక్కలు నాటారు
Job Scam | తల్లి మరణించినట్లు నమ్మించి ప్రభుత్వ ఉద్యోగాలు.. మధ్యప్రదేశ్‌లో మరో భారీ స్కామ్
Watch: గ్యాస్ స్టేషన్ సిబ్బందిపై గన్ గురిపెట్టిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?