చెన్నై: గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం మృతులకు ఒక వ్యక్తి వినూత్నంగా నివాళి అర్పించారు. ఈ విషాద సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి జ్ఞాపకార్థం పలువురితో కలిసి 270 మొక్కలు నాటారు. (270 saplings planted) తమిళనాడులోని మధురైలో ఈ సంఘటన జరిగింది. స్థానిక ఇంజినీర్ చోళన్ గుబేంద్రన్ పర్యావరణ పరిరక్షణకు ఎంతో కృషి చేస్తున్నారు. ఇప్పటికే లక్షకు పైగా మొక్కలు నాటి పాపురల్ అయ్యారు.
కాగా, జూన్ 12న అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 229 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది, 29 మంది ఇతర వ్యక్తులతో సహా సుమారు 270 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. దేశవ్యాప్తంగా విషాదం నింపిన ఈ దుర్ఘటనపై చోళన్ గుబేంద్రన్ చలించిపోయారు. విమాన ప్రమాద మృతులకు వినూత్నంగా నివాళి అర్పించారు. స్వచ్ఛంద సేవకులతో కలిసి మరణించిన వారి జ్ఞాపకార్థం 270 మొక్కలను నాటారు. ‘ఇది మా నివాళి. ఈ చెట్ల ద్వారా వారి జ్ఞాపకాలు సజీవంగా ఉంటాయని నేను నమ్ముతున్నా. ఈ చెట్లు ఇతరులకు ఆక్సిజన్, జీవితాన్ని అందిస్తాయి’ అని చోళన్ గుబేంద్రన్ అన్నారు.
Also Read:
Job Scam | తల్లి మరణించినట్లు నమ్మించి ప్రభుత్వ ఉద్యోగాలు.. మధ్యప్రదేశ్లో మరో భారీ స్కామ్
Watch: గ్యాస్ స్టేషన్ సిబ్బందిపై గన్ గురిపెట్టిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: అదుపుతప్పిన స్కార్పియో.. తర్వాత ఏం జరిగిందంటే?