లక్నో: డ్రైవర్ మద్యం సేవించి డ్రైవింగ్ చేయడంతో మహీంద్రా స్కార్పియో ఎస్యూవీ అదుపుతప్పింది. నిర్మాణంలో ఉన్న గోడను ఢీకొట్టింది. ఆ తర్వాత ఆగి ఉన్న ఈ ఆటోపైకి అది దూసుకెళ్లింది. (Scorpio Climbs Onto Auto) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం అచల్పూర్ గ్రామం సమీపంలో వేగంగా వెళ్తున్న స్కార్పియో అదుపు తప్పింది. నిర్మాణంలో ఉన్న గోడను ఢీకొట్టింది. ఆ తర్వాత అక్కడున్న ఎలక్ట్రిక్ ఆటోపైకి అది దూసుకెళ్లింది. దీంతో ఆటో ధ్వంసమైంది.
కాగా, ఇది చూసి గ్రామస్తులు అక్కడ గుమిగూడారు. స్కార్పియోలో ఉన్న డ్రైవర్, మరో వ్యక్తి మద్యం సేవించారని ఆరోపించారు. మరో రోడ్డు ప్రమాదం నుంచి తప్పించుకునే క్రమంలో ఈ సంఘటనకు పాల్పడినట్లు చెప్పారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకున్నారు. స్కార్పియో, ధ్వంసమైన ఈ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
📍 मैनपुरी | अनियंत्रित स्कॉर्पियो ई-रिक्शा पर चढ़ी, दीवार तोड़ते हुए मचाई तबाही
➡️ स्कॉर्पियो कार अनियंत्रित होकर मकान की दीवार तोड़ ई-रिक्शा पर चढ़ गई
➡️ हादसे में ई-रिक्शा बुरी तरह क्षतिग्रस्त, गनीमत रही कि कोई जनहानि नहीं हुई
➡️ पुलिस ने स्कॉर्पियो को सीज कर थाने में खड़ा… pic.twitter.com/HmDtodVV4U— भारत समाचार | Bharat Samachar (@bstvlive) June 15, 2025
Also Read:
Man Carries Stillborn For 80 Km In Bag | మరణించిన శిశువును.. 80 కిలోమీటర్లు బ్యాగులో మోసిన వ్యక్తి
Watch: భారీ వర్షానికి కూలిన ప్రహరీ గోడ.. తర్వాత ఏం జరిగిందంటే?
Tej Pratap | కాశీ ఆలయంలోని నిషేధిత ప్రాంతంలో తేజ్ ప్రతాప్ వీడియో.. దర్యాప్తునకు ఆదేశం