మంగళవారం 24 నవంబర్ 2020
National - Nov 09, 2020 , 13:08:16

ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన గుప్కార్ కూటమి

ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన గుప్కార్ కూటమి

శ్రీనగర్ :  పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్ (పీఏజీడీ) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆర్టికల్ 370 ని రద్దు చేయడం, జమ్ముకశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడాన్ని సవాలు చేస్తూ ముందస్తు విచారణను కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. జమ్ముకశ్మీర్‌లోని ఏడు ప్రధాన పార్టీల సంకీర్ణమైన పీఏజీడీ అక్టోబర్ 15 న ఏర్పడింది. నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ, పీపుల్స్ కాన్ఫరెన్స్, అవామి నేషనల్ కాన్ఫరెన్స్, సీపీఎం, సీపీఐ, జే అండ్ కే పీపుల్స్ మూవ్మెంట్ ఈ కూటమిలో భాగంగా ఉన్నాయి. 

ఆర్టికల్ 370 కింద మంజూరు చేసిన జమ్ముకశ్మీర్‌ యొక్క ప్రత్యేక హోదాను ఉపసంహరించి.. ఈ ప్రాంతాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ఆగస్టు 5 న ప్రకటించింది. గత వారం, కేంద్రం యొక్క ఈ చర్యను సవాలు చేస్తూ వరుస అభ్యర్ధనలను ముందస్తుగా విచారించాలని పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఎదుటకు తీసుకెళ్లారు. నిరంతర ఇంటర్నెట్ షట్‌డౌన్‌తోపాటు ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నందున ఈ ప్రాంత ప్రజలు చాలా ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని పిటిషనర్ తెలిపారు. జమ్ముకశ్మీర్ రాష్ట్రం యొక్క ప్రజల శ్రేయస్సు కోసం ప్రేరేపించబడిన ఉత్తర్వులను రద్దు చేయడం వలన ఇక్కడి ప్రజలు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారని, అందువలన ముందస్తుగా తమ పిటిషన్‌ను విచారించి న్యాయం చేయాలని తమ పిటిషన్‌లో కోరారు. 

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ప్రకారం జమ్ముకశ్మీర్ యొక్క ప్రత్యేక హోదాను రద్దు చేయాలన్న కేంద్రం నిర్ణయం యొక్క రాజ్యాంగ ప్రామాణికతను సవాలు చేస్తూ పిటిషన్లను విచారించడానికి సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం మార్చిలో నిరాకరించిన విషయం తెలిసిందే.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.