Surya Namaskar | కొత్త ఏడాది (New Year) రోజు గుజరాత్ (Gujarat) ప్రభుత్వం సరికొత్త రికార్డు సృష్టించింది (Remarkable Feat). రాష్ట్రంలోని 108 ప్రాంతాల్లో ఒకేసారి ఎక్కువ మంది సామూహిక సూర్య నమస్కారాలు (Surya Namaskar) చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) తన ట్విటర్ ఖాతాలో పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు.
‘కొత్త ఏడాది 2024ను గుజరాత్ అరుదైన ఘనతతో స్వాగతించింది. 108 వేదికల్లో ఒకేసారి అత్యధిక మంది సూర్య నమస్కారాలు చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పింది. మన సాంస్కృతి, సంప్రదాయాల్లో 108 సంఖ్యకు ఎంత ప్రాముఖ్యత ఉందో మనందరికీ తెలుసు. యోగా పట్ల మనకున్న నిబద్ధతకు, మన సాంస్కృతిక వారసత్వానికి ఇది నిదర్శనం’ అంటూ ప్రధాని మోదీ రాసుకొచ్చారు. ప్రతి ఒక్కరూ రోజూవారీ దినచర్యలో సూర్యనమస్కారాన్ని భాగం చేసుకోవాలని ఈ సందర్భంగా ప్రధాని మోదీ కోరారు. సూర్య నమస్కారాల వల్ల అపారమైన ప్రయోజనాలు కలుగుతాయని తెలిపారు.
Gujarat welcomed 2024 with a remarkable feat – setting a Guinness World Record for the most people performing Surya Namaskar simultaneously at 108 venues! As we all know, the number 108 holds a special significance in our culture. The venues also include the iconic Modhera Sun… pic.twitter.com/xU8ANLT1aP
— Narendra Modi (@narendramodi) January 1, 2024
108 ప్రాంతాల్లో దాదాపు 4వేల మందికి పైగా ఈ సూర్యనమస్కారాల్లో పాల్గొన్నారు. 51 విభిన్న కేటగిరీల్లో ఈ సూర్య నమస్కారాలను ప్రదర్శించారు. మోధెరా సూర్య దేవాలయంలో జరిగిన ఈ రికార్డ్ బ్రేకింగ్ ఈవెంట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, హోం మంత్రి హర్ష్ సంఘ్వీ, పలువురు విద్యార్థులు, వృద్ధులు, యోగా ఔత్సాహికులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధి సైతం హాజరయ్యారు. అత్యధిక మంది ఒకేసారి సూర్య నమస్కారాలు చేయడంలో ఇదే తొలి రికార్డ్ అని గిన్నిస్ ప్రతినిధి తెలిపారు.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજના નવા વર્ષના પ્રથમ દિવસની વહેલી સવારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ‘રોગને પડકાર, સૂર્યનમસ્કાર’ના સંદેશ સાથે આયોજિત સામૂહિક સૂર્યનમસ્કાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
દેશના પ્રથમ સોલાર વિલેજ મોઢેરા સહિત રાજ્યમાં વિવિધ 108 સ્થળો પર આયોજિત… pic.twitter.com/AcCD0zBmpJ
— CMO Gujarat (@CMOGuj) January 1, 2024
Also Read..
Arvind Kejriwal | జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి.. పార్టీ కార్యకర్తలతో కేజ్రీవాల్
Earthquake | జపాన్లో 7.4 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు
Srinagar | చలిగుప్పిట్లో అందాల శ్రీనగర్.. భారీగా పతనమైన ఉష్ణోగ్రతలు