Aluminium Salt | ప్యాకేజ్డ్ ఫుడ్ ఇష్టపడేవాళ్లకి షాకింగ్ న్యూస్.. అవి తింటే నరాల బలహీనత, మతిమరుపు వచ్చే ఛాన్స్!
Aluminium Salt | కాలంతో పోటీపడి పరుగెడుతున్న నేటి ఆధునిక సమాజంలో ఎంతో మందికి నాణ్యమైన ఆహారాన్ని తయారు చేసుకునే తీరిక కూడా ఉండటం లేదు.
Aluminium Salt | హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): కాలంతో పోటీపడి పరుగెడుతున్న నేటి ఆధునిక సమాజంలో ఎంతో మందికి నాణ్యమైన ఆహారాన్ని తయారు చేసుకునే తీరిక కూడా ఉండటం లేదు. ఉరుకులు పరుగులతో కూడిన జీవితంలో సులభంగా ఆహారాన్ని తయారు చేసుకునేందుకు ‘రెడీ టు యూజ్’ పదార్థాలను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఆ పదార్థాలు ఎక్కువ కాలం నిల్వ ఉండేలా చూసేందుకు వ్యాపారులు హానికర రసాయనాలను కలిపి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నిత్యం మనం ఇండ్లలో ఎక్కువగా ఉపయోగించే కారం, పసుపు, మసాలాల్లో అల్యూమినియం సాల్ట్స్‌ను కలుపుతున్నారు. వీటి వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలు తలెత్తున్నాయని, బాధితుల్లో చిన్నపిల్లలు, వృద్ధులు ఎక్కువగా ఉంటున్నారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నరాల బలహీనత,మతిమరుపు సమస్యలు
ఆలమ్ స్పైస్ కలిపిన మసాలాలను దీర్ఘకాలంపాటు ఉపయోగిస్తే నాడీవ్యవస్థ దెబ్బతిని నరాల బలహీనత, మతిమరుపు లాంటి సమస్యలు తలెత్తుతాయని, ఎదిగే పిల్లలు, వృద్ధుల్లో దీని ప్రభావం అధికంగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా 50 ఏండ్లు దాటినవారిలో కనిపించే మతిమరుపు సమస్యలు ప్రధానంగా ఆలమ్ స్పైస్ వల్లనే ఉత్పన్నమవుతున్నాయని స్పష్టం చేస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మార్కెట్లలో లభ్యమయ్యే పసుపు, కారం, మసాలాల జోలికి వెళ్లొద్దని, వాటిని ఇండ్లలోనే తయారు చేసుకోవాలని సూచిస్తున్నారు.
అల్యూమినియం సాల్ట్స్ అంటే..
అల్యూమినియం పొటాషియం సల్ఫేట్‌ను అల్యూమినియం సాల్ట్ అని, సాధారణంగా ‘ఆలమ్ స్పైస్’ అని అంటారు. యాంటీ కేకింగ్ కెమికల్ అయిన దీన్ని మసాలా దినుసులు పాడవకుండా ప్యాకేజింగ్‌లో వాడుతారు. దీని వల్ల మసాలా దినుసుల స్వభావం, రుచి మారదు. పసుపు, కారం లాంటి పొడులు ఉండలుగా మారకుండా ఉండేందుకు ఇది దోహదపడుతుంది. దీన్ని మోతాదుకు మించి వినియోగించరాదని ఆహార భద్రతా నియమాలు స్పష్టం చేస్తున్నాయి. కానీ, ప్రస్తుతం వ్యాపారులు దీన్ని దాదాపు అన్ని రకాల నిత్యావసర వస్తువుల ప్యాకింగ్‌లో మోతాదుకు మించి వాడుతున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్‌కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

