IPS Promotions | హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో సీనియర్ ఐపీఎస్‌లు 1995వ బ్యాచ్‌కు చెందిన ముగ్గురు అధికారులకు డీజీ హోదా కల్పించడాన్ని ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. డీజీ హోదాకు అర్హత సాధించినా పదోన్నతి కోసం మహేశ్‌భగవత్, వీవీ శ్రీనివాసరావు, స్వాతిలక్రాకు ఎదురుచూపులు తప్పడంలేదు.
ఇటీవల వీరి పదోన్నతికి అడ్డంకులు తొలిగిపోయా యి. డీజీ క్యాడర్లో కొనసాగిన కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, జితేందర్ ఉద్యోగ విరమణ పొందగా.. రవిగుప్తా స్వచ్ఛంద ఉద్యోగ విరమణ తీసుకున్నారు. వారి స్థానంలో మూడు డీజీ ర్యాంకులను భర్తీ చేయాల్సి ఉన్నా.. ఈ మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టడంలేదు. మహేశ్‌భగవత్, వీవీ శ్రీనివాసరావు, స్వాతిలక్రా కంటే ఏడాది జూనియర్ అయిన వైజాగ్ సీపీ శంఖబ్రత బాగ్చికి ఏపీ ప్రభుత్వం డీజీ క్యాడర్ కల్పించింది. డిసెంబర్లో డీజీ హోదా వస్తుందని వీరు అధికారులు ఆ శించినా.. అది ఫలించేలా కనిపించడం లేదని అధికారవర్గాలు చెప్తున్నాయి.