హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): సంక్రాంతి పండుగకు 11 అదనపు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ రైళ్ల రాకపోకలు జనవరి 6 నుంచి 11 మధ్యలో కొనసాగుతాయని చెప్పారు. టికెట్ బుకింగ్ సోమవారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతుందని అధికారులు పేర్కొన్నారు. దక్షిణ మధ్య రైల్వేజోన్ ఆధ్వర్యంలో 2025లో అన్ని రంగాల్లో స్థిరమైన వృద్ధి నమోదు చేశామని, కొత్త రైళ్లను ఏర్పాటు చేయడంతోపాటు సరుకు రవాణాలతో రాబడి మైలురాళ్లను అధిగమించామని ఆదివారం రైల్వే జీఎం తెలిపారు. ఈ ఏడాదిలో స్టేషన్ల అభివృద్ధి, ప్రయాణికులకు అదనపు సౌకర్యాల కల్పనలో మెరుగైన ఫలితాలు సాధించామని చెప్పారు.