గురువారం 03 డిసెంబర్ 2020
National - Nov 10, 2020 , 18:23:26

‘బిహార్‌లో మహాగట్‌బంధన్‌ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది’

‘బిహార్‌లో మహాగట్‌బంధన్‌ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది’

పాట్నా: బిహార్‌లో మహాఘట్‌బంధన్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తేజస్వీయాదవ్‌ నేతృత్వంలోని ఆర్జేడీ పార్టీ తెలిపింది. ఇప్పటి వరకు ఉన్న వివరాల ప్రకారం బిహార్‌లో ఎన్‌డీఏ లీడ్‌లో ఉండగా.. దూసుకెళ్తుండగా.. ఆర్జేడీ నేతృత్వంలోని గ్రాండ్‌ అలయన్స్‌ వెనుకంజలో నిలిచింది. ఈ సందర్భంగా ఆర్టేడీ ప్రకటన చేసింది. మేం మా అభ్యర్థులు, అన్ని ప్రాంతాల్లోని కార్యకర్తలను సంప్రదిస్తున్నామని, వారి నుంచి వచ్చిన సమాచారం మేరకు ఫలితాలు మాకు అనుకూలంగా ఉన్నాయని ట్వీట్‌ చేసింది. కొవిడ్‌-19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకొని ఓటింగ్‌ రోజున సామాజిక దూరం నిబంధనలు పాటించేందుకు పోలింగ్‌ కేంద్రాలను పెంచింది. దీంతో లెక్కింపు ప్రక్రియ రాత్రి వరకు కొనసాగుతోందని ఎన్నికల కమిషన్‌ తెలిపింది. ‘మహాఘట్‌బంధన్‌ ప్రభుత్వం ఖచ్చితంగా ఏర్పడుతుంది, బిహార్‌ మార్పును ఎన్నికలు ప్రభావితం చేశాయని ఆర్జేడీ పేర్కొంది. కౌంటింగ్‌ పూర్తయ్యే వరకు కౌంటింగ్ కేంద్రాల్లో ఉండాలని పార్టీ తన అభ్యర్థులు, ఏజెంట్లను కోరింది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.