Haryana political crisis | బలపరీక్ష నిర్వహించండి.. గవర్నర్కు లేఖ రాసిన దుష్యంత్ చౌతాలా
Haryana political crisis | బీజేపీ పాలిత హర్యానాలో రాజకీయ సంక్షోభం ముదురుతున్నది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని కోరుతూ జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) చీఫ్ దుష్యంత్ చౌతాలా గురువారం హర్యానా గవర్నర్కు లేఖ రాశారు.
చండీగఢ్: బీజేపీ పాలిత హర్యానాలో రాజకీయ సంక్షోభం (Haryana political crisis) ముదురుతున్నది. సీఎం నయాబ్ సింగ్ సైనీ ప్రభుత్వానికి ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని కోరుతూ జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) చీఫ్ దుష్యంత్ చౌతాలా గురువారం హర్యానా గవర్నర్కు లేఖ రాశారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వానికి మెజారిటీ లేకపోతే హర్యానాలో రాష్ట్రపతి పాలన అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కాగా, హర్యానాలో బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చడం కోసం కాంగ్రెస్కు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని బీజేపీ మాజీ మిత్రపక్షమైన దుష్యంత్ చౌతాలా స్పష్టం చేశారు. ‘రెండు నెలల కిందట ఏర్పడిన ప్రభుత్వం ఇప్పుడు మైనారిటీలో ఉంది. ఎందుకంటే వారికి మద్దతిచ్చిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒకరు బీజేపీ నుంచి, మరొకరు స్వతంత్ర ఎమ్మెల్యే రాజీనామా చేశారు. అలాగే బీజేపీకి మద్దతు ఇస్తున్న ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు తమ మద్దతును ఉపసంహరించుకున్నారు. ఈ ప్రభుత్వంపై విశ్వాస తీర్మానం ప్రవేశపెడితే, వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవాలా? వద్దా? అన్నది కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించుకోవాలి’ అని ఆయన అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

