Governors : రాష్ట్రపతి (President of India) ద్రౌపది ముర్ము (Droupadi Murmu) రెండు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి నూతన గవర్నర్ల (Governors) ను నియమించారు. గోవా (Goa), హర్యానా (Haryana) రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతం లడఖ్ (Ladakh) కు కొత్త గవర్నర్లు నియమితులయ్యారు. కేంద్ర మాజీ మంత్రి (Former Union Minister), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అశోక్ గజపతిరాజు (Ashok Gajapati Raju) గోవా గవర్నర్‌గా నియమితులయ్యారు.
అదేవిధంగా హర్యానా గవర్నర్‌గా ప్రొఫెసర్ అషింకుమార్ ఘోష్‌ను నియమించారు. కేంద్రపాలిత ప్రాంతం లడఖ్‌కు కవీందర్ గుప్తా లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం రాష్ట్రపతి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.