Romance on Road : ఈ మధ్య కాలంలో కొన్ని ప్రేమ జంటలు (Lovers) విపరీత పోకడలు పోతున్నాయి. ఏ మాత్రం సిగ్గూఎగ్గూ లేకుండా, అందరూ చూస్తున్నారనే విషయాన్ని పట్టించుకోకుండా బహిరంగ ప్రదేశాల (Public places) లోనే రొమాన్స్ చేస్తున్నాయి. మెట్రో రైళ్లు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, రోడ్లపై ఇలాంటి ఘటనలు తరచూ చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ (Hyderabad) లో అలాంటిదే మరో ఘటన జరిగింది.
అరాంఘర్ ఫ్లైవోవర్‌పై ఆదివారం రాత్రి ఓ ప్రేమ జంట బరితెగించింది. రన్నింగ్ బైక్‌పై ప్రమాదకరంగా కూర్చుని రొమాన్స్ చేసింది. యువతిని పట్రోల్ ట్యాంకుపై తనవైపు తిప్పి కూర్చోబెట్టుకుని యువకుడు బైకు నడిపాడు. రన్నింగ్ బైకుపై ఇద్దరూ ముద్దుల్లో మునిగితేలారు. రోడ్డుపై వాహనాల రాకపోకలు సాగుతున్నా ఆ జంట పట్టించుకోలేదు. వారి రొమాన్స్‌ను వెనుకాల మరో వాహనంలో వెళ్తున్న వాళ్లు మొబైల్లో రికార్డు చేశారు.
దాంతో ఆ ప్రేమ జంట రొమాన్స్‌కు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ వీడియోపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రన్నింగ్ బైక్‌పై ఇలాంటి స్టంట్లు ప్రమాదకరమని, పబ్లిక్‌గా రొమాన్స్ చేయడం కరెక్ట్ కాదని మండిపడుతున్నారు. ప్రేమ జంట రొమాన్స్‌కు సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు.
రోడ్ల మీద వికృత చేష్టలు
హైదరాబాద్ – ఆరాంఘర్ ఫ్లై ఓవర్ మీద రొమాన్స్ చేస్తూ బైక్ నడిపిన ప్రేమ జంట pic.twitter.com/MdCnXmKW5j
— Telugu Scribe (@TeluguScribe) July 14, 2025