News Papers | జైపూర్, జనవరి 3: ఉత్తర్ ప్రదేశ్ తరహాలోనే రాజస్థాన్లోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వార్తాపత్రికల పఠనాన్ని తప్పనిసరి చేస్తూ రాజస్థాన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించడం, పదజాలాన్ని మెరుగు పరచడం, ప్రపంచ జ్ఞానాన్ని పెంచే లక్ష్యంతో రాజస్థాన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఉదయపు ప్రార్థనా సమావేశంలో(మార్నింగ్ అసెంబ్లీ) కనీసం పది నిమిషాలపాటు వార్తాపత్రికలను విద్యార్థులు చదవాలని డిసెంబర్ 31న జారీ చేసిన ఉత్తర్వులో రాజస్థాన్ ప్రభుత్వం ఆదేశించింది.
ప్రతి ప్రభుత్వ సీనియర్ సెకండరీ, ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు తప్పనిసరిగా రెండు వార్తా పత్రికలను తెప్పించుకోవాలని, అందులో ఒకటి హిందీ, మరొకటి ఇంగ్లిష్ పత్రిక ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. అప్పర్ ప్రైమరీ స్కూళ్లు తప్పనిసరిగా కనీసం రెండు హిందీ వార్తా పత్రికలను తెప్పింంచుకోవాలని, వీటికి అయ్యే ఖర్చును రాజస్థాన్ విద్యా మండలి భరిస్తుందని తెలిపింది.
Watch: పాముతో వ్యక్తి సంభాషణ.. వీడియో వైరల్
Cigarettes | ‘సిగరెట్ల కోసం వియత్నాం ఫ్లైట్ ఎక్కండి’.. ఓ ఇన్వెస్ట్మెంట్ అడ్వయిజర్ పోస్టు వైరల్
Watch: స్వాతంత్ర్యం సిద్ధించిన 78 ఏళ్ల తర్వాత ఆ గ్రామానికి రోడ్డు.. తొలి బస్సుకు ఘన స్వాగతం