Tejashwi Yadav : లోక్ జనశక్తి పార్టీ (LJP) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ (Chirag Paswan) ఈ మధ్య తనను చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయని అన్నారు. దీనిపై ఆర్జేడీ (RJD) కీలక నేత తేజస్వి యాదవ్ (Tejashwi Yadav) స్పందించారు. ‘ప్రధాని దగ్గరికి వెళ్లి బీహార్‌లో జంగిల్‌రాజ్ (Jungle Raj) ఉందని చెప్పుకో పో’ అని పాశ్వాన్‌కు సలహా ఇచ్చారు.
ఆర్జేడీ హయాంలో ఆటవిక పాలన (జంగిల్‌రాజ్) సాగిందని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సలహా పలువురు బీజేపీ నేతలు తరచూ విమర్శలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్రంలో ఎన్డీఏ పాలన ఉన్నా అధికార కూటమి నేతకు బెదిరింపులు రావడంతో తేజస్వియాదవ్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.
కాగా బీహార్‌లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతున్నాయి. పోటీ ప్రధానంగా అధికార, ప్రతిపక్ష కూటముల మధ్యే ఉండనుంది. ప్రతిపక్ష కూటమిలో ఆర్జేడీ, కాంగ్రెస్ ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. ఈ క్రమంలో కూటమి పార్టీల్లో సీట్ల షేరింగ్‌పై చర్చలు కొనసాగుతున్నాయని తేజస్వి యాదవ్ చెప్పారు.