భోపాల్: ప్రభుత్వ రెసిడెన్షియల్ హాస్టల్‌కు చెందిన 13 ఏళ్ల బాలిక గర్భం దాల్చింది. ఆమెకు నెలలు నిండినప్పటికీ ఎవరూ గుర్తించలేదు. ఆ విద్యార్థిని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. (Girl Living In Hostel, Gives Birth) ఆమె గర్భం దాల్చడానికి కారణమైన బాలుడిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పర్సమౌ గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికా హాస్టల్లో నివసిస్తున్న 13 ఏళ్ల బాలిక 8వ తరగతి చదువుతున్నది.
కాగా, ఇటీవల ఆ విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గర్హి ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఆ బాలిక గర్భం దాల్చడంతోపాటు నెలలు నిండినట్లు వైద్య పరీక్షల్లో గుర్తించారు. డాక్టర్లు ఆమెకు కాన్పు చేయగా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో మహిళా పోలీస్ స్టేషన్‌తో పాటు విద్యాశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
మరోవైపు మహిళా పోలీసులు ఆ ఆసుపత్రికి చేరుకున్నారు. ఆ బాలికను ప్రశ్నించగా తన గ్రామానికి చెందిన బాలుడు వల్ల గర్భం దాల్చినట్లు చెప్పింది. గత ఏడాది ఏప్రిల్‌లో సెలవులకు వెళ్లినప్పుడు వారిద్దరూ శారీరకంగా కలిసినట్లు పోలీసులు తెలుసుకున్నారు. నాడు మైనర్ అయిన 18 ఏళ్ల బాలుడ్ని అదుపులోకి తీసుకున్నారు. జువినల్ హోమ్‌కు తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అయితే గ్రామీణ, గిరిజన ప్రాంతాల బాలికల విద్యకు ఉద్దేశించిన కస్తూర్బా గాంధీ రెసిడెన్షియల్ హాస్టల్లో ఈ సంఘటన జరుగడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో గిరిజన వ్యవహారాల శాఖ కమిషనర్ దర్యాప్తునకు ఆదేశించారు. విద్యార్థిని గర్భం దాల్చినప్పటికీ గుర్తించకపోవడం, ఆమె ఆరోగ్య పరిస్థితిని గమనించకపోవడం, బాలిక తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకపోవడంలో నిర్లక్ష్యం వహించిన హాస్టల్ సూపరింటెండెంట్, ఉపాధ్యాయురాలైన చైన్బాటి సాయింను సస్పెండ్ చేశారు.
Also Read:
Explosion In Karnataka | కర్ణాటకలో పేలుడు.. స్కూల్ విద్యార్థులతో సహా ఆరుగురికి గాయాలు
Car In Handcuffs | డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు.. కారుకు బేడీలు వేసిన పోలీసులు
Sunetra Pawar | మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా.. సునేత్ర పవార్ ప్రమాణ స్వీకారం
Sharad Pawar | ‘ఆ విషయం నాకు తెలియదు’.. సునేత్రకు డిప్యూటీ సీఎం పదవిపై శరద్ పవార్