శుక్రవారం 03 ఏప్రిల్ 2020
National - Feb 24, 2020 , 00:56:59

గ్యాంగ్‌స్టర్‌ రవి పూజారి అరెస్ట్‌

గ్యాంగ్‌స్టర్‌ రవి పూజారి అరెస్ట్‌
  • దక్షిణాఫ్రికాలో అదుపులోకి తీసుకున్న భారత అధికారులు

బెంగళూరు: పరారీలో ఉన్న గ్యాంగ్‌స్టర్‌ రవి పూజారిని భారత అధికారులు దక్షిణాఫ్రికాలో అరెస్టుచేశారు. కర్ణాటక అధికారుల బృందం అతడిని భారత్‌ తీసుకొస్తున్నదని పోలీస్‌ అధికారులు ఆదివారం మీడియాకు తెలిపారు. కర్ణాటకతోపాటు దేశవ్యాప్తంగా పలు  హత్య లు, దోపిడీ కేసుల్లో రవిపూజారి వాంటెడ్‌ క్రిమినల్‌. 15 ఏండ్లుగా పరారీలో ఉన్నాడు. పశ్చిమాఫ్రికాలోని సెనెగల్‌లో అతడ్ని అధికారులు అదుపులోకి తీసుకున్నా రు. రవిపూజారిని సోమవారం ఉద యం బెంగళూరు తీసుకొస్తారని పోలీసువర్గాలు తెలిపాయి. హత్యలు, దోపిడీలు సహా 200లకుపైగా కేసుల్లో అతడు నిందితుడిగా ఉన్నాడు. 


logo