Chhattisgarh | రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్‌లోని దట్టమైన అడవుల్లో మరోసారి తుపాకులు గర్జించాయి. బుల్లెట్ల వర్షం కురిసింది. బీజాపూర్ జిల్లాలోని ఊసూరు పోలీసు స్టేషన్ పరిధిలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య భీకరమైన ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. పామేడు – మద్దేడు అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. మావోయిస్టుల మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ ఎదురుకాల్పుల్లో భద్రతా బలగాలకు ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. ఈ ఎదురుకాల్పులకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
NEET UG 2025 | ఎన్టీఏ సంచలన నిర్ణయం.. పెన్ పేపర్ మోడ్‌లోనే నీట్ యూజీ-2025 పరీక్ష
CM Devendra Fadnavis | ముంబై సేఫ్‌గా లేదనడం కరెక్ట్ కాదు : సీఎం దేవేంద్ర ఫడణవీస్
IBPS Job calendar | నిరుద్యోగులకు శుభవార్త.. ఐబీపీఎస్ ఎగ్జామ్ క్యాలెండర్ విడుదల