CM Devendra Fadnavis – Saif Ali Khan | బాలీవుడ్ నటుడు.. పటౌడి వంశ వారసుడు సైఫ్ అలీఖాన్ మీద దాడి జరిగిన విషయం తెలిసిందే. అతడిపై గుర్తుతెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. గురువారం తెల్లవారుజామున ముంబై బాంద్రాలోని ఆయన నివాసంలోకి చొరబడిన దుండగుడు కత్తితో సైఫ్‌పై దాడి చేశాడు. దీంతో ఆయన ఒంటిపై ఆరుచోట్ల గాయాలయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన లీలావతి దవాఖానకు తరలించారు. గాయలతో ఉన్న సైఫ్‌కి వైద్యులు సర్జరీ చేయగా.. విజయవంతగా పూర్తయినట్లు తెలిసింది. దీంతో సైఫ్ ప్రమాదం నుంచి బయటపడినట్లు ఆసుపత్రి సిబ్బంది వెల్లడించింది.
అయితే సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగిన అనంతరం ముంబై సురక్షితం కాదనే ట్రెండ్ మొదలైంది. ఇప్పటికే ముంబైలో మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీని కాల్చి చంపిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ అనంతరం కండల వీరుడు సల్మాన్ ఖాన్ చంపేస్తామంటూ వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడు తాజాగా సైఫ్ అలీఖాన్‌పై కూడా దాడి జరగడంతో సెలబ్రిటీలకే రక్షణ లేకపోతే ఇక సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి అని అటు సీని ప్రముఖులతో పాటు కొందరు ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే
అయితే ఈ వ్యాఖ్యలపై తాజాగా స్పందించారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్. ఆయన మాట్లాడుతూ.. సైఫ్ అలీఖాన్‌పై దాడి జరగడం ఆందోళన కలిగించే విషయమే కానీ ఈ విషయం వలన ముంబైని సురక్షితం కాదని అనడం తప్పు. దేశంలోని అన్ని మెగాసిటీల్లో కెల్లా ముంబయి సురక్షితమైనది. అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయనేది వాస్తవమే. వీటిని నిరోధించడానికి అలాగే భద్రతా చర్యలను పెంచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ముంబై పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా దాడి చేసిన వ్యక్తిని గుర్తించారు, దర్యాప్తు కొనసాగుతోంది! అంటూ ఫడణవీస్ చెప్పుకోచ్చారు.
“It won’t be right to say Mumbai is unsafe based on one, two incidents”: Maharashtra CM Devendra Fadnavis
Read @ANI Story | https://t.co/6hovSlZn8e#CMFadnavis #Mumbai #DevendraFadnavis pic.twitter.com/eZgv8nsoNk
— ANI Digital (@ani_digital) January 16, 2025