IBPS Job calendar | కొత్త ఏడాదిలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. బ్యాంకు ఉద్యోగాలకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు.. ఐబీపీఎస్ శుభవార్త వినిపించింది. 2025 ఏడాదికి గానూ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో చేపట్టనున్న ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఐబీపీఎస్ ఎగ్జామ్ క్యాలెండర్ను విడుదల చేసింది.
ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా ఆయా బ్యాంకుల్లో ఆఫీసర్ స్కేల్ 1, 2, 3, ఆఫీస్ అసిస్టెంట్లు వంటి ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్లు, మేనేజ్మెంట్ ట్రెయినీలు, స్పెషలిస్ట్ ఆఫీసర్లు, వినియోగదారుల సేవా సహాయకుల వంటి పోస్టుల భర్తీని చేపట్టనున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించిన ఆన్లైన్ ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షల తేదీల వివరాల కోసం అధికారిక పోర్టల్ https://ibps.inను చూడొచ్చు.
ఆఫీసర్ స్కేల్ 1 : ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఆఫీస్ అసిస్టెంట్లు, ఆఫీసర్ స్కేల్ 1, 2, 3 స్థాయి ఉద్యోగాల భర్తీకి ఉమ్మడిగా ప్రిలిమినరీ పరీక్షలు జరుగుతాయి. ఆఫీసర్ స్కేల్ 1 స్థాయి పోస్టులకు దరఖాస్తు చేసేవారికి ఈ ఏడాది జులై 27న, ఆగస్టు 2, 3 తేదీల్లో ప్రిలిమినరీ పరీక్షలను నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన మెయిన్స్ పరీక్ష నవంబరు 13న జరుగుతుంది.
ఆఫీసర్ స్కేల్ 2, 3 : ఈ పోస్టులకు సంబంధించిన పరీక్ష తేదీలను ఐబీపీఎస్ విడుదల చేయలేదు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించే వారికి నవంబరు 13న మెయిన్స్ పరీక్ష ఉంటుంది.
ఆఫీస్ అసిస్టెంట్స్ : ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారికి ఆగస్టు 30, సెప్టెంబరు 6,7 తేదీల్లో ప్రిలిమినరీ పరీక్షలను నిర్వహిస్తారు. దీనిలో అర్హత సాధించే వారికి నవంబరు 9న మెయిన్స్ పరీక్ష జరుగుతుంది.
ప్రొబేషనరీ ఆఫీసర్లు/మేనేజ్మెంట్ ట్రెయినీలు : ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే వారికి అక్టోబరు 4, 5, 11 తేదీల్లో ప్రిలిమినరీ పరీక్షలు జరుగుతాయి. మెయిన్స్ పరీక్ష నవంబరు 29న జరుగుతుంది.
స్పెషలిస్ట్ ఆఫీసర్స్ : ఈ పోస్టులకు దరఖాస్తు చేసే వారికి నవంబరు 22, 23 తేదీల్లో ప్రిలిమినరీ పరీక్షలు జరుగుతాయి.2026 సంవత్సరం జనవరి 4న మెయిన్స్ పరీక్షలు జరుగుతాయి.
కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ : ఈ పోస్టులకు దరఖాస్తు చేసే వారికి డిసెంబరు 6,7, 13, 14 తేదీల్లో పరీక్షలు ప్రిలిమినరీ జరుగుతాయి. మెయిన్స్ పరీక్ష 2026 ఫిబ్రవరి 1న జరుగుతుంది.
ఇవి కూడా చదవండి..
TOMCOM | సౌదీలో నర్సు ఉద్యోగాలు.. దరఖాస్తులకు టామ్కామ్ ఆహ్వానం
CA 2025 Exam | సీఏ పరీక్షల షెడ్యూల్ విడుదల