CA 2025 Exam | న్యూఢిల్లీ, జనవరి 13: సీఏ మే 2025 పరీక్షల షెడ్యూల్ను ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) ప్రకటించింది. మే 15 నుంచి మే 21 వరకు సీఏ ఫౌండేషన్ పరీక్షలు జరగనున్నాయి. మే 3వ తేదీ నుంచి 14 వరకు సీఏ ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 2వ తేదీ నుంచి 13 వరకు సీఏ తుది(ఫైనల్) పరీక్షలు జరుగుతాయి.
ఫౌండేషన్, ఇంటర్మీడియట్, ఫైనల్ పరీక్షల కోసం అభ్యర్థులు అందరూ https://eservices.icai.org పోర్టల్లో దరఖాస్తు చేసుకొని, ఫీజు చెల్లించాలని ఐసీఏఐ తెలిపింది. దరఖాస్తు ప్రక్రియ మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని, ఆలస్య రుసుము లేకుండా మార్చి 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. రూ.600 ఆలస్య రుసుముతో మార్చి 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.