Naveen Patnaik | ఒడిశా (Odisha) మాజీ ముఖ్యమంత్రి, బిజు జనతా దళ్ (బీజేడీ) అధినేత నవీన్ పట్నాయక్ (Naveen Patnaik) ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు (discharged from hospital). అస్వస్థత కారణంగా ఆస్పత్రిలో చేరిన ఆయన మూడు రోజుల అనంతరం బుధవారం సాయంత్రం డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా తాను త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ బీజేడీ చీఫ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈనెల 17న ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.
శనివారం రాత్రి (ఆగస్టు 16) నవీన్ పట్నాయక్ అసౌకర్యానికి గురికావడంతో వైద్యులు ఆయన నివాసానికి వెళ్లి పరీక్షించారు. అయితే, పరిస్థితి మెరుగుపడకపోవడంతో ఆదివారం మధ్యాహ్నం తర్వాత భువనేశ్వర్‌లోని (Bhubaneswar) ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. నవీన్ పట్నాయక్ డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. చికిత్సకు సహకరిస్తున్నారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలిపాయి. ఇక మూడు రోజులు చికిత్స అనంతరం నిన్న సాయంత్రం నవీన్ పట్నాయక్ డిశ్చార్జ్ అయ్యారు.
కొంతకాలంగా వయసు సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, ఇటీవలే ముంబైలో శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. ఆర్థరైటిస్ సమస్య కారణంగా వెన్నెముకకు జూన్‌లో శస్త్రచికిత్స చేయించుకున్నారు. అయితే, రెండు నెలల్లోనే ఆయన అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
సుదీర్ఘకాలం ఒడిశా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన నవీన్ పట్నాయక్, వరుసగా ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి రికార్డు సృష్టించారు. మార్చి 2000 నుంచి జూన్ 2024 వరకు ఆయన సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే, 24 ఏళ్లు ఒడిశాకు సీఎంగా సేవలందించిన నవీన్ పట్నాయక్ దూకుడుకు బీజేపీ అడ్డుకట్టవేసింది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజు జనతాదళ్ పార్టీ పరాజయం పాలైంది. దీంతో ఆ రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం కొలువుదీరింది.
Also Read..
Vaishno Devi Pilgrims | లోయలో పడ్డ బస్సు.. ఒకరు మృతి.. పలువురికి గాయాలు
Malayalam Actress | హోటల్‌కి రమ్మన్నాడు.. యువ రాజకీయ నాయకుడిపై ప్రముఖ నటి లైంగిక ఆరోపణలు
Rekha Gupta | ఢిల్లీ సీఎం రేఖాగుప్తాకు భద్రత పెంపు.. Z-కేటగిరీ సెక్యూరిటీ