Vaishno Devi Pilgrims | జమ్ము కశ్మీర్లో (Jammu And Kashmir) ప్రమాదం చోటు చేసుకుంది. మాతా వైష్ణోదేవి ఆలయానికి భక్తులతో (Vaishno Devi Pilgrims) వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. అనేక మంది గాయపడ్డారు.
సాంబా (Samba) జిల్లాలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సు వైష్ణోదేవి భక్తులతో ఉత్తరప్రదేశ్ నుంచి కాట్రాకు వెళ్తోంది. అయితే, జత్వాల్ వద్దకు రాగానే టైర్ పేలడంతో బస్సు అదుపుతప్పి హైవేనుంచి పక్కన ఉన్న లోతైన లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. సుమారు 39 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. మృతుడు అమ్రోహాకు చెందిన ఇక్బాల్ సింగ్‌గా గుర్తించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Also Read..
Malayalam Actress | హోటల్‌కి రమ్మన్నాడు.. యువ రాజకీయ నాయకుడిపై ప్రముఖ నటి లైంగిక ఆరోపణలు
Rekha Gupta | ఢిల్లీ సీఎం రేఖాగుప్తాకు భద్రత పెంపు.. Z-కేటగిరీ సెక్యూరిటీ
Sudershan Reddy | ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి నామినేషన్