Sudershan Reddy | విపక్ష ఇండియా కూటమి (INDIA alliance) ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా (Vice Presidential nominee) సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీ సుదర్శన్ రెడ్డి (B Sudershan Reddy) నామినేషన్ (Nomination) దాఖలు చేశారు. నామినేషన్‌కు ఇవాళ చివరి తేదీ కావడంతో కాంగ్రెస్ అగ్రనేతల సమక్షంలో తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. నామినేషన్ కార్యక్రమానికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా పలువురు ఇండియా కూటమి నేతలు హాజరయ్యారు. బీ సుదర్శన్ రెడ్డి నామినేషన్‌ను బలపరుస్తూ సోనియా సహా 20 మంది ఎంపీలు సంతకాలు చేశారు.
#WATCH | INDIA alliance Vice-Presidential nominee, former Supreme Court Judge B Sudershan Reddy files his nomination in the presence of Congress president-Rajya Sabha LoP Mallikarjun Kharge, Congress Parliamentary Party Chairperson Sonia Gandhi and Lok Sabha LoP Rahul Gandhi.… pic.twitter.com/Xxg6KX2ncQ
— ANI (@ANI) August 21, 2025
మరోవైపు అధికార ఎన్డీఏ కూటమి (NDA Alliance) ఉప రాష్ట్రపతి (Vice President) అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) బుధవారం నామినేషన్ (Nomination) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi), పలువురు కేంద్ర మంత్రుల సమక్షంలో ఆయన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.
జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామాతో ఖాళీ ఏర్పడిన ఉపరాష్ట్రపతి పదవికి సెప్టెంబర్ 9న ఎన్నిక జరగనుంది. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి స్పష్టమైన మెజారిటీ ఉంది. ఈ నేపథ్యంలో రాధాకృష్ణన్ విజయం లాంఛనప్రాయమేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. సంఖ్యా బలం దృష్ట్యా చూస్తే ఆయన ఎన్నిక ఏకపక్షంగా జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
Also Read..
“ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డి”
“ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్.. ఎన్డీయే తరఫున బరిలోకి”