Rekha Gupta | ఢిల్లీ సీఎం రేఖాగుప్తా (Rekha Gupta)పై దాడి జరిగిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం అధికారిక నివాసంలో ‘జన్ సున్వాయి’(ప్రజావాణి) కార్యక్రమంలో ప్రజలతో మాట్లాడుతుండగా ఓ వ్యక్తి ఆమె దగ్గరికి వచ్చి.. కొన్ని పేపర్లు అందజేశాడు. హఠాత్తుగా ఆమె చేయి పట్టుకుని తనవైపు లాక్కునేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఢిల్లీ సీఎం భద్రతపై ఆందోళనలను రేకెత్తించింది. ఈ నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. ఢిల్లీ సీఎం భద్రతను పెంచింది.
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)తో Z-కేటగిరీ (Z category) భద్రతను కల్పించింది. దీంతో ఇవాళ ఉదయం సీఆర్పీఎఫ్ సిబ్బంది సీఎం నివాసానికి చేరుకుంది. సీఎంకు 24 గంటలూ రక్షణ కల్పించేందుకు ముఖ్యమంత్రి నివాసంతోపాటూ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున మోహరించారు. సీఆర్‌పీఎఫ్‌తోపాటూ ఢిల్లీ పోలీసులు, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ సీఎంకు నిరంతరం రక్షణ కల్పించనున్నారు.
#WATCH | CRPF personnel arrive at Delhi CM Rekha Gupta’s residence, a day after she was attacked during ‘Jan Sunvai’. Additional security is being deployed here. pic.twitter.com/gjwS7vFXgg
— ANI (@ANI) August 21, 2025
బుధవారం ఉదయం అధికారిక నివాసంలో ‘జన్ సున్వాయి’(ప్రజావాణి) కార్యక్రమంలో ప్రజలతో మాట్లాడుతుండగా ఓ వ్యక్తి ఆమె దగ్గరికి వచ్చి.. కొన్ని పేపర్లు అందజేశాడు. హఠాత్తుగా ఆమె చేయి పట్టుకుని తనవైపు లాక్కునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పెనుగులాట జరిగింది. ఈ క్రమంలో సీఎం తలకు స్వల్ప గాయమైంది. అక్కడ ఉన్నవారు అతడిని బంధించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని హత్యాయత్నం కేసు నమోదుచేశారు. నిందితుడు గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన రాజేశ్‌భాయ్ సకారియా(42)గా గుర్తించారు. అతడు జంతు ప్రేమికుడిగా తెలుస్తున్నది.
Also Read..
Sudershan Reddy | ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి నామినేషన్
Microsoft | మైక్రోసాఫ్ట్‌లో ఇజ్రాయెల్ అలజడి.. 18 మంది ఉద్యోగులు అరెస్ట్
Apple | బెంగళూరులో యాపిల్ తొలి రిటైల్ స్టోర్ ఓపెనింగ్‌కి ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..?